తిరుప్పావై ; - వరలక్ష్మి యనమండ్ర
14. పాశురము :

ఉఙ్గళ్ పుళైక్కడై త్తోట్టత్తు వావియుళ్ శెఙ్గళు నీర్ వాయ్ నెగిళ్ న్దు అమ్బల్ వాయ్ కూమ్బినకాణ్ శెఙ్గల్ పొడిక్కూటై వెణ్బల్ తవత్తవర్ తఙ్గళ్ తిరుక్కోయిల్ శజిడువాన్ పోగిన్జార్ ఎఙ్గళై మున్నమ్ ఎళుప్పువాన్ వాయ్ పేశుమ్ నజ్గాయ్! ఎళున్దిరాయ్ నాణాదాయ్ నావుడైయాయ్! శళ్లొడు శక్కర మేన్దుమ్ తడక్కెయన్ పఙ్గయక్కణ్ణానై ప్పాడేలో రెమ్బావాయ్
***********
30-12-2023, శనివారము..13వ పాశురం....భావం ..పంచపదులలో
***********
14 వ రోజు పాశురము భావము

స్వామి సేవకు లేపెదనంటివి మరచితివా గోపెమ్మ
ఏమమ్మా ఇంకను లేవక పడుకునుంటివ గోపెమ్మ
కృష్ణ పూజలో లీనమైతివా చెప్పమ్మ నువు గోపెమ్మ
పిలిచిన ఉలకవు పలకవు తలుపుతీయవు గోపెమ్మ
వినబడలేదా మాదు మాటలు లేవవు ఏమే గోపెమ్మ
... కృష్ణా 

పెరటి బావికడ నిను చూసితిమి ఓ చెలీ
నల్లని కలువలు ముడుచుకుండెను ఓచెలీ
ఎర్రని కలువలు వికసించినవి కదా ఓ చెలీ
సత్వగుణము గల యతులు వచ్చిరి ఓ చెలీ
నిద్దుర లేచీ ఇటు రావమ్మ తలుపు తీయవే... కృష్ణా 


తీసుకెళ్ళెనుశతాళపు గుత్తిని పూజారి ఓ చెలీ
దేవాలయము తలుపు తెరయుటకు  ఓ చెలీ
స్వామి స్మరణము, సేవను చేతము రావె చెలీ
కన్నులు తెరచీ కృష్ణుని పూజకు రావేమే ఓ చెలీ
శుక్ర వారం నోము నోచెదము రావేమే ఓ చెలీ.. కృష్ణా 
***********


కామెంట్‌లు