న్యాయాలు -358
స్వామి భృత్య న్యాయము
******
స్వామి అనగా యజమాని,ఒడయుడు, కుమారస్వామి,దేవుడు,భర్త,వస్తు స్వాతంత్ర్యము గలవాడు, ఆచార్యుడు, గొప్ప సన్యాసి అనే అర్థాలు ఉన్నాయి.భృత్యుడు అనగా పోషణము కావలసిన వాడు, పనివాడు,సేవకుడు, బంటు,దాసుడు అనే అర్థాలున్నాయి.
యజమాని మరియు సేవకునికి గల సంబంధం అని అర్థము.
మరి యజమాని సేవకుని మధ్య బంధం అనే విషయాన్ని ఏయే కోణాల్లో చూడాల్సి వుంటుందో,అది ఎలానో చూద్దాం.
మానవ చరిత్రను నాటి నుండి నేటి వరకు చదివితే,పరిశీలించి చూస్తే ఎక్కడ చూసినా నరజాతి చరిత్ర సమస్తంలో సేవకత్వం అనేది ఒక చోట అంతర్లీనంగా, మరో చోట బాహాటంగా కనిపిస్తూనే ఉంటుంది.
ప్రతి నాగరికతలోనూ ఈ యజమాని,సేవకుల మధ్య గల సంబంధాన్ని గమనించవచ్చు.
యజమాని మరియు సేవకునికి గల సంబంధం ఆర్థికంగా మరియు వ్యక్తిగతంగా ముడిపడి వుంటుంది.సేవకుడు యజమాని యొక్క ప్రయోజనం కోసమే పని చేస్తూ వుంటాడు.
ఇందులో ముఖ్యంగా గమనించవలసిన విషయం ఏమిటంటే ఓ ఇద్దరు సమానమైన తెలివి తేటలు గల యజమానులు ఉన్నారు అనుకుందాం.వారిలో ఓ యజమాని సేవకుల పట్ల ఉదాసీనంగా, బలహీనంగా, నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే అక్కడ సేవకుని పనితీరులో నాణ్యత, పరిమాణం అంత మంచిగా వుండదు.యజమాని తన వద్ద పనిచేసే సేవకుల పట్ల దయ,సానుభూతి ,ప్రేమ కనబరిచినట్లయితే అక్కడ పనిలో నాణ్యత, ఉత్పాదకత ఎక్కువగా ఉంటుంది.
ఇక "రాజ భృత్య సంబంధం" ఎలా వుంటుందంటే రాజు గారి ఆజ్ఞను వినమ్రంగా పాటిస్తూ అపారమైన భక్తి శ్రద్ధలను భృత్యుడు కనపరుస్తూ వుంటాడు.అలాగే రాజు కూడా తనకు నమ్మిన బంటు అయిన సేవకుని పట్ల వాత్సల్యం కనబరుస్తాడు.ఇలా వారు పరస్పరోపకార్యోపకారక భావమునకు తగినట్లుగా వుంటారు.
ఇది కేవలం రాజు- బంటు మరియు యజమాని- సేవకుడికేనా ఈ సంబంధం మరింకేం లేదా అనుకుంటే ఉంది.అదే భగవంతుడికి భక్తుడికి మధ్య ఉన్న సంబంధం.
యజమాని వంటి భగవంతుని సేవించడానికి మూడు విధాలు ఉన్నాయి.మొదటి విధానంలో భగవంతుడు, భక్తుడు వేరు కాదు.అదెలా అంటే సూర్యుడి ప్రతిబింబం సూర్యుడిలో కలిసి పోయినట్లు, ఉప్పు బొమ్మ సముద్రంలో కలిసినట్లు,మంచుబిందువు సముద్రంలో కరిగిపోయినట్లు...పరమాత్మ అయిన భగవంతుడికి, జీవాత్మ అయిన భక్తుడికి భేదం లేదని అర్థము.
తనకు ఇష్టమైన వ్యక్తిని లేదా దైవాన్ని భక్తి శ్రద్ధలతో పూజిస్తూ తద్వారా ముక్తిని పేరును పొందడం.ఉదాహరణకు హనుమంతుడు, లక్ష్మణుడు,వివేకానందుడు మొదలైన వారు.
కష్టాల్లో దైవంపై దృష్టి నిలిపి శరణాగతి పొందడం.ఉదాహరణకు భాగవతంలో గజేంద్రుడు, మహా భారతంలో ద్రౌపది.
ఇలా ఇహ, పర, భౌతిక ,ఆధ్యాత్మిక సంబంధమైన భావనలతో ఈ న్యాయమును చూడవచ్చునని ఈ "స్వామి భృత్య న్యాయము"ద్వారా గ్రహించవచ్చు.
ప్రభాత కిరణాల నమస్సులతో 🙏

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి