* కోరాడ అష్టాక్షరీ గీతాలు*

 రామ రామ యను చును
 రామ చిలుక పలికే... 
 సీత మది పులకించె
  రామ.. నీలమేఘస్యామ..!! 
  ********
ఏక పత్ని వ్రతుడవు
ఆడి తప్పని వాడవు
దశరధ తన యుడ
 రామ..! నీలమేఘస్యామ..!! 
    ******
రావణ సంహారి నీవు
దై త్య కుల వినాశక
 ధర్మము నిలిపి నావు
  రామ..! నీల మేఘ స్యామ..!! 
     ******
తండ్రి మాట నిలుపగా
 అడవుల కేగి నావు
 లక్ష్మణ సహోదరుడ
రామ..! నీల మేఘ స్యామ..!! 
      *******
విశ్వా మిత్రుని వెనుక
మిధిలా నగరి జేరి
సీతను పెండ్లాడి నావు
 రామ..! నీల మేఘ స్యామ..!! 
       *****
కామెంట్‌లు