తిరుప్పావై- కొప్పరపు తాయారు
 🌻13,పాశురం🌻
    పుళిన్ వాయ్ కీ జ్ఞానై  పుళ్ళవరక్కనై  క్కిళ్ళి
    క్కళైందానై క్కీర్తిమై  పాడి ప్పోయ్  గల్లఆరఉమ్
    పావక్కళమ్  బుక్కార్ వెళ్ళి యళున్దు వియాళ
    ముణజిత్తు  ప్పుళ్ళుమ్ శిలుంబిన కాణ్ 
     పోదరి  కణ్ణి నాయ్ కుళక్కుళిరక్కు డైన్దు
     నీరాడా  వళ్ళిక్కి డత్తి యో పావాయ్! నీ
     నన్నాళాల్  కెళ్ళిమ్  తవిర్ న్దు   కలన్దేలో
     , రెమ్బావాయ్ 
        
        కంసునిచే పంపబడిన బకాసురుని నోటిని చీల్చిన శ్రీకృష్ణుని యొక్క యు దుష్టుడైన రావణుని పది తలలు గిల్లి పారవేసిన శ్రీరాముని యొక్కయు కల్యాణ గుణ సంకీర్తనలను, చేస్తూ శ్రీకృష్ణుని సంశ్లేషమును అనుభవింపగోరు గోపికలందరును
సంకేత స్థలమునకు ఎప్పుడో చేరిపోయిరి. నీ వింకను లేవకున్నావు. తెల్లవారినదని సూచించూచూ , శుక్రుడు ఉదయించెను, బృహస్పతి అస్తమించెను. ఇవిగో, పక్షులన్నియు తమ ఆహారాన్వేషణ నిమిత్తం అరుచుకుంటూ ఆకాశంలోకి ఎగిరిపోతున్నాయి అని గోపికలు చెప్పగా నిద్రిస్తున్న గోపిక తన కనులను తెరచి చూచింది. ఆమె నేత్ర సౌందర్యానికి ముగ్ధులై, వికసించిన తామర పువ్వులందు వ్రాలిన తుమ్మెద కన్నులు కలదానా!  ఇకనైనను  లేచి రావమ్మా!
నీ నేత్ర సౌందర్యానికి ముగ్ధుడై శ్రీకృష్ణ స్వామి  తానే నీ వద్దకు వచ్చునని భ్రమించుకు. శ్రీకృష్ణుడు విరహతాపమును కొనుటకు ఈ చల్లని నీటిలో అందరితో కలిసి స్నానమాడ గా రావమ్మా! ఇంకనూ పని ఉండరాదు మనము నో చేయి వ్రతమునకు ఇది శుభ సమయము మంచి కాలము ఓ సుందరి నీ కపటమును వీడి మా గోష్టి లో  కలిసి మహిమాన్వితమగు ఈ వ్రతమును సాంగో పాంగముగా పూర్తి చేయుటకు సహకరించుము అన్నింటను శుభములే కలుగును. అని గోదాదేవాదు లు ఎనిమిదవ గోపికను మేల్కొలుపుచున్నారు
🪷*****🪷*****🪷

కామెంట్‌లు