శ్రీ విష్ణు సహస్రనామాలు (బాల పంచపది )- ఎం. వి. ఉమాదేవి
31)సంభవః -

తనకుతానైన అవతారము
లేదికను కర్మ కారణము 
లేనట్టిది ఎట్టి బంధనము
కోరుకున్నచోనిచ్చు దర్శనము 
శ్రీ విష్ణు సహస్రనామాలు ఉమా!
32)భావనః -

కామితార్థముల ప్రసాదనము 
తొలిగించునులే మాలిన్యము 
భక్తులకిచ్చునుగా అభయము
ప్రసాదించునూ పునర్జన్మము 
శ్రీ విష్ణు సహస్రనామాలు!ఉమా!
33)భర్తాః -

అందరినీ భరించెడి వాడు
యోగక్షేమముల కారకుండు
సకలలోక పరమార్థకుడు
పతి, గతి తానైనట్టి వాడు
శ్రీ విష్ణు సహస్ర నామాలు ఉమా!
34)ప్రభవః -

దివ్యమైన జన్మగలవాడు
స్వచ్ఛoధ అవతారకుండు 
కర్మలకు లోబడని వాడు
యోగియై ప్రభవించువాడు 
శ్రీ విష్ణు సహస్ర నామాలు ఉమా!
35)ప్రభుః -

సర్వాధిపతిగానున్నవాడు
శక్తిమంతుడై రాజిల్లువాడు
బ్రహ్మాదులకు భోగమొసగువాడు
సర్వులకునూ మోక్షమిచ్చువాడు
శ్రీ విష్ణు సహస్రనామాలు ఉమా!

కామెంట్‌లు