స్ఫూర్తి దాతలు! అచ్యుతుని రాజ్యశ్రీ

 హైరికార్డ్ లను బద్దలుకొట్టిన జ్యోతి యారాజి హర్డలర్ గా రాణిస్తోంది.విశాఖపట్టణంకి చెందిన ఈమె తండ్రి సూర్య నారాయణ ఒక ప్రైవేటు సంస్థలో సెక్యూరిటీ గార్డు.తల్లి ఆస్పత్రి క్లీనర్ గా పార్ట్ టైం జాబ్ చేస్తోంది.పొడుగ్గా ఉన్న ఈమె కి పి.టి.సార్ ప్రోత్సాహం తో అథ్లెట్ గా మారింది.థాయ్లాండ్ ఏషియన్ అథ్లెటిక్స్ ఛాంపియన్ షిప్ లో గోల్డ్ మెడల్ పొందింది.23ఏళ్ళవయసులో ఈఘనతసాధించింది.
రాకెట్ ఉమన్ రితుకరిథాల్ చంద్రయాన్ యాత్రలో ముఖ్యపాత్ర పోషించారు.లక్నోకి చెందిన ప్రాజెక్ట్ చంద్ర యాన్ 2కి డైరెక్టర్ గా పనిచేసిన అనుభవం తో చంద్ర యాన్ 3 తో ఆమె గొప్ప సైంటిస్ట్ గా ప్రపంచ దృష్టిని ఆకర్షించింది.మంగళయాన్ మిషన్ లో కూడా ఆమె డిప్యూటీ డైరెక్టర్.54మంది మహిళా ఇంజనీర్లటీంకి లీడర్ గా ఉన్న ఘనత ఆమెది.లక్నోలో ఫిజిక్స్ లోడిగ్రీ చేసిన ఈమెఎం.టెక్.పి.హెచ్.డి.సగంలోనే ఆపేసి ఏరోస్పేస్ లో స్పెషలైజేషన్ చేసింది.1997 నుంచి ఇస్రోలో పనిచేసే ఈమె కు యంగ్ సైంటిస్ట్ అవార్డు దక్కింది.🌷
అదితి బల్బీర్ రిసార్ట్ ఫౌండర్ సి.ఇ.ఓ.గా మహిళా పారిశ్రామికవేత్తలకు స్పూర్తి ప్రదాత గా నిలిచింది.హైదరాబాద్ ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ విద్యార్థినిగా ఆమె రాణించింది.బాల్యంనుంచీ కొత్త ప్రదేశాలు విహారాలు చూడటం తెల్సుకోటం ఆమె కి ఇష్టం.దాన్ని కెరీర్ గా మార్చుకొని 5 ఏళ్ల కల్లా 21రాష్ట్రాల్లో 120పైగా రిసార్ట్ లకి తొలిబ్రాండెడ్ మహిళగా యు.ఎన్.డబ్లు.టి.ఓ. పురస్కారం అందుకున్నారు. మరి రిసార్ట్ బాధ్యత సామాన్యంకాదు.కానీ ఆమె ఇందులో స్ఫూర్తి పొందారు.🌺
కామెంట్‌లు