మనోనేత్రం- గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
ఆకాశంలో
ఒక్కమేఘమూలేదు
భూమిమీద
ఒక్కచుక్కాపడలేదు

కుంభవృష్టి
ఎలాకురుస్తుంది
ఏరులు
ఎలాప్రవహిస్తాయి

అక్షరం
ఒక్కటీచిక్కటంలేదు
పదం
ఒక్కటీపొసగటంలేదు

కవితలు
ఎలాకూర్చేది
పుస్తకము
ఎలాప్రచురించేది

ఆలోచనలు
ఒక్కటీతట్టటంలేదు
భావములు
ఒక్కటీబయటకురావటంలేదు

కలము
ఎలాముందుకుసాగుతుంది
కాగితాలు
ఎలానిండుకుంటాయి

కాలము
ఒక్కక్షణమాగటంలేదు
తీరిక
ఒక్కనినిమిషందొరకటంలేదు

కబుర్లు
ఎలాచెప్పుకునేది
కాలక్షేపము
ఎలాచేసుకునేది

అందాలు
ఒక్కటీకనబడటంలేదు
ఆనందము
ఒక్కటీకలుగుటలేదు

కళ్ళను
ఎలాకట్టడిచేసేది
మనసును
ఎలాతృప్తిపరచేది

మనోనేత్రము
ఒక్కటితెరచుకుంది
మంచివిషయాలను
ఒకటితర్వాతొకటిచూపింది

కవితాలు
కుప్పలుతెప్పలుగాపుట్టాయి
కవనాలు
కాంతికిరణాలువెదజల్లాయి

నదులు
ఎండిపోవు
మనసు
ఎడారికాదు
 
నేత్రము
లోపల ఉంటే
కవిత్వము
కూడా అక్కడే


కామెంట్‌లు