ఆరోజు పిల్లలు బడికి రాగానే బ్లాక్ బోర్డు శుభ్రంగా తుడిచి ఓసూక్తి తెలుగు హిందీ ఇంగ్లీష్ లో రాశారు.హెచ్.ఎం.అనుమతితో బైట గోడలపై గుణింతాలు ఎక్కాలు పెయింటింగ్ చేశారు.దానివల్ల కె.జి.నుంచి టెన్త్ క్లాస్ పిల్లలదాకా అవి చూడటం అలవాటు అయి నేర్చుకుంటున్నారు.తాము వేసిన డ్రాయింగ్ ఒక తాడుకి తగిలిస్తున్నారు.రోజూ ఓపద్యం శ్లోకం అప్పజెప్తున్నారు.జి.కె.ప్రశ్నలు టీచర్ అడుగుతోంది "తెలంగాణ సెయిలింగ్ ఛాంపియన్ లో సత్తా చాటుతున్న బాలిక ఎవరు?" కొమురవెల్లి లాహిరి టీచర్!"
"ప్రధాని మోదీజీ ప్రారంభించిన కొత్త రైళ్లు ఏంటి!?" అమృత భారత్ వందే భారత్!" శభాష్!
"మిల్లెట్స్ చిరుధాన్యాలపై పాటరాసి పాడిందెవరు?" శివా అన్నాడు " ఫాల్గుణీ షా..ఈమె 3 వ ఏట నుంచే కూనిరాగాలు తీస్తూ శాస్త్రీయ సంగీతం నేర్చుకుని పెళ్లి కాగానే అమెరికా లో ఉంది.ఇండో అమెరికన్ బ్యాండ్ " కరిష్మా" లో లీడ్ సింగర్ గా ఉంటూ పిల్లల ఆల్బం " ఎ కలర్ఫుల్ వరల్డ్ " కి గ్రామీ అవార్డుపొందింది.మోదీజీ సలహాపై చిరుధాన్యాలపై పాటరాస్తే ఆయనకూడా గీతరచనలో పాలు పంచుకోవడం విశేషం.ఆపాట " అబండెన్స్ ఇన్ మిల్లెట్స్ " బాగా ప్రచారంలో ఉంది."17 ఏళ్ళ విభాజానకీ రామన్ వైలెన్ నేర్చి అమెరికా వైట్ హౌస్ లో ప్రెసిడెంట్ కుటుంబం మన ప్రధాని ముందు పాడిప్రశంసలు పొందిన భారతీయ బాలిక.ఇక సంగీతం లో బెస్ట్ ఆఫ్ ఏషియా పురస్కారం పొందిన భారతీయ యువతి జనని.మధురైకి చెందిన ఈమె మన మంగళంపల్లి బాలమురళీకృష్ణ గారి శిష్యురాలు.కర్ణాటక హిందుస్తానీ లో దిట్ట.మన బాలూ హరిహరన్ మొదలైన వారితో పాడి జాతీయ అంతర్జాతీయ బహుమతులు పొందారు.పిల్లలు సంగీతం నేర్చుకుంటే మానసిక ఒత్తిడి తగ్గుతుంది.కనీసం రేడియో లో వింటూ దేశభక్తి లలితగీతాలు నేర్చుకోండి 🌹

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి