నేను రోడుపైన నడుస్తూ
యథాలాపంగా చూశా
నిబిడాశ్చర్యంలో మునిగిపోయా
రోడుమీద సింగిడి నడిచి వెళుతున్నట్లుంది
ఆదృశ్యం ఎంత నయనానందకరం?
అలావెళుతున్నది బిందెలు బాబూ బిందెలు
తెల్లవి,ఎర్రవి,నీలివి,చిలకపచ్చవి,
నారింజ,నేరేడు,పసుపు,నలుపు అబ్బో!
ప్రకృతిలోని రంగులన్నీ కదిలి వెళుతున్నట్లుంది
పాపం! వాటి భవితవ్యం ఎలాఉందో?!
అవి,నీటితోనిండుతాయో? పాలతోనో?
చల్లలుచేసి వెన్నలుతీయడానికో?
మట్టినితడిపి మొక్కలకు ప్రాణంపోయడానికో?
గొంతులు తడపడంకోసమో?
గోవిందుని అర్చనకో?
సరే! దేనికైనా సిధ్ధంగా ఉన్నాయ్!
తమకుతామే అర్పించుకుంటున్నాయి!
"మాచివరాఖరువరకు మీసేవకు మేం రెడీ!"
అంటున్నాయి ,అవి ప్లాస్టిక్ బిందెలు!!!
*************************************
.
బిందెలు;- డా.గౌరవరాజు సతీష్ కుమార్
• T. VEDANTA SURY

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి