శ్రీ విష్ణు సహస్రనామాలు (బాల పంచపది );- ఎం. వి. ఉమాదేవి
 11)
పరమాత్మా -
పరమమయింది ఈ దైవము
ఇంతకన్నా లేదు అధికము
గతిలోన ఇదియే ఉత్తమము
సర్వులకు తానే హృదయము
తనకులేదుగా ఆత్మ శూన్యము!
శ్రీ విష్ణు సహస్రనామాలు ఉమా!
12)ముక్తానామ్ పరమాగతి-
ముక్తులైనచో పరమాశ్రయము
ఆశించవలసినదీ గమ్యము
గతిలోన ఇదిఎంత ఉత్తమము
నదులు చేరునట్టి సాగరము 
శ్రీ విష్ణు సహస్రనామాలు! ఉమా!
13)అవ్యయః 
తరిగిపోనిది దివ్యతేజము 
పడపోనీయని జన్మచక్రము 
లేదూ వినాశము వికారము 
శుద్ధపరిణామము గోచరము 
శ్రీ విష్ణు సహస్ర నామాలు ఉమా!
14)
పురుషః -
బ్రహ్మానందమదియు పుష్కలము
శరీరములోపల శయనము
సమస్తముకు నితడు పూర్వము
జగత్తుకే పరిపూర్ణత్వము 
శ్రీ విష్ణు సహస్ర నామాలు ఉమా!
15)సాక్షీ -
సర్వవిశ్వముకును సాక్షీభూతుడు
సమస్తమును ఎరిగినట్టివాడు
భక్తానందమును వీక్షించువాడు
ప్రీతితోడ కటాక్షించుచున్నాడు
శ్రీ విష్ణు సహస్రనామాలు ఉమా!

కామెంట్‌లు