స్వార్ధము విడ నాడాలి
త్యాగివి నువ్ కావాలి
ప్రేమయు సేవలతో నే
ప్రపంచాన్ని గెలవాలి...!
******
నోరు మంచి దై నపుడే
ఊరు మంచి దవునురా
స్నేహ శీలతతో నువ్
ప్రపంచాన్ని గెలవాలి...!
*****"
ఉదారతను చూపించు
నీకున్నది కొంత పంచు
మంచితనముతో నీవు
ప్రపంచాన్ని గెలవాలి...!
******
శతృత్వమువిడ నాడు
పగ,ప్రతీ కారం వద్దు
సోదర భావము తోనే
ప్రపంచాన్ని గెల వాలి..!
******
పరస్త్రీల వ్యామోహము
పర ధనాప హరణం
తలపున రానీయక
ప్రపంచాన్ని గెలవాలి..!
******
నేను, నాదను తలపు
మనసున తొలగించు
మనము, మనదంటూ
ప్రపంచాన్ని గెల వాలి..!
*****

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి