శ్రీ విష్ణు సహస్రనామాలు ; -ఎం. వి. ఉమాదేవి
(బాల పంచపది 
=======================
21)నారసింహ వపుః -

ప్రహ్లాద రక్షకుడగుటకు గాను 
శ్రీనారసింహము తానయ్యెను
అవతారచంద్రికవెలయించెను
ఆత్మనిర్భరము కలిగించెను 
శ్రీ విష్ణు సహస్రనామాలు ఉమా!
22)శ్రీమాన్ -

రమణీయరూపము గలవాడు
శ్రీనారసింహమై వెలసినవాడు
వక్షస్థలమున లక్ష్మిగలవాడు
శ్రీమాన్ మహావిష్ణువైనాడు 
శ్రీ విష్ణు సహస్రనామాలు!ఉమా!
23)కేశవః -

సుందరమైన కేశములవాడు
కేశి రాక్షస సంహారకుడు
త్రిమూర్తులరూపం తానైనవాడు
వాసుదేవ చైతన్యoగలవాడు
శ్రీ విష్ణు సహస్ర నామాలు ఉమా!
24)పురుషోత్తమః -

పురుషులలో సర్వోత్తముడు

బద్ధనిత్యముక్తులలో ఘనుడు
క్షర అక్షరులకు అతీతుడు
ఇద్దరికంటెను ఉన్నతుడు 
శ్రీ విష్ణు సహస్ర నామాలు ఉమా!
25)సర్వః -

సర్వమూ తానే అయినవాడు
సృష్టియంతటికి కారకుడు
స్థితి స్థాపకతయున్నవాడు
లయించుటకునూ కారకుడు
శ్రీ విష్ణు సహస్రనామాలు ఉమా!
కామెంట్‌లు