26)శర్వః -
సకలపాపాలు హరించువాడు
జీవులదుఃఖములు తీర్చువాడు
అనిష్టములను తొలగించువాడు
ప్రళయమున కాపాడగలవాడు!
శ్రీ విష్ణు సహస్రనామాలు ఉమా!
27)శివః -
మంగళములను ఒసగువాడు
శుభములను అందించు వాడు
అందరికినీ భక్తసులభుడు
నిత్యతపమును చేయువాడు
శ్రీ విష్ణు సహస్రనామాలు!ఉమా!
28)స్థాణుః -
సుస్థిరమైనట్టి దివ్యతముడు
భక్తులను అనుగ్రహించువాడు
నిశ్చయముగా కామ్యమిచ్చువాడు
వృద్ధిక్షయముల బడనివాడు
శ్రీ విష్ణు సహస్ర నామాలు ఉమా!
29)-భూతాదిః -
సకలభూతముల మూలకుడు
సర్వలోకములకు కారకుడు
భూతప్రకృతిన వందితుడు
పంచభూతాల కారకుండు
శ్రీ విష్ణు సహస్ర నామాలు ఉమా!
30)నిధరవ్యయః -
తరగని పెన్నిధియైనవాడు
ప్రళయమున రక్షించువాడు
లోకాన్ని భద్రపరుచువాడు
ప్రాణకోటిని పరికించువాడు

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి