తిరుప్పావై;- కొప్పరపు తాయారు
   🌻18వ,పాశురం🌻

ఉన్దు మదకళిత్త !నోడాద తోళ్వియన్  నన్ద
గోపాలన్ మరుమగళే ! నప్పిన్నాయ్ కన్దయే 
కమళుమ్ కుళలీ! కడైతిరవాయ్ వన్టెజ్జెమ్  కోళి 
అళైత్తన కాణ్  మాధవి ప్పన్దల్  మేల్  పల్  కాల్ 
కుయిలి నజ్జల్  కూవినగాణ్ పన్చార్  విరవ !
ఉన్మైతునన్ పేర్పాడ చెద్ధామరైక్కైయాల్
శ్రీరార్ వళై  యొళిప్ప వన్దు తిరువాయ్
మగళిందే లో రెమ్బావాయ్
నందగోపులు మొదలుగా బలరాముని వరకు మేల్కొల్పి తలుపులు తీయమని ప్రార్థించినను మదదళము  స్రవించుచున్న ఏనుగ వంటి బలము   కలవాడై.   శత్రువులకు భయపడని భుజములు గల నందగోపుని యొక్క కోడలా! ఓ నా పిన్నవిరాట్టి !
పరిమళిస్తున్న కేసు సంపద కల దాన ! తలుపు తెరువు  మమ్మా ! కోళ్ళు వచ్చి కూయుచున్నవి. జాజి పందిళ్ళ మీద కోకిలలు గుంపులు గుంపులుగా కూడి మాటిమాటికి కూయుచున్నవి సుమా ! నీవు నీ భర్త యును సరససల్లాపములాడు సందర్భములో నీకు
ఓటమి కలిగిన చో మేము నీ పక్షమునే యుందుము.
దోషారోపణకు వీలుగా ఆయన పేర్లు మేమే పాడెదములే ! కావున అందమైన నీ చేతులకున్న 
భూషణములన్నీ ధ్వనించే టట్లుగా నీవు నడచి వచ్చి
ఎర్రని తామరలవంటి నీ సుకుమారమైన చేతులతో ఆ తలుపులను తెరువుమమ్మా ! అని గోపాంగనలు నీలాదేవి నీ పాశురమున మేల్కొలుపుచున్న
🪷****🪷*****🪷

కామెంట్‌లు