సుప్రభాత కవిత ; -బృంద
వేచిన వ్యధల ఓర్పునకు
ఓదార్పులా 
నిదుర కాచిన కనులకు
ఎదురొచ్చే నిజం

సమస్యల చిక్కుముడి
విప్పుకునే నేర్పు 
సమన్వయ సమయస్ఫూర్తిని
నేర్పే వివేకం

ఎన్నో పాఠాలు చెప్పిన
అనుభవాల కూర్పుతో
పట్టువిడుపులు పాటిస్తూ
ప్రతిఫలం పొందే నైపుణ్యం

కాలానికనుగుణమైన
మార్పులు చేసుకుంటూ
అందరినీ కలుపుకుని
కొనసాగే  సహకారం

జయాపజయాల తీర్పు
దైవానికొసగి
పోరాటపటిమ చూపి
గెలుపొందే సాహసం

ప్రతి ఒకరికీ ప్రతి రోజూ
బ్రతుకుబాటలో అవసరమయే
ఓర్పు...నేర్పు కూర్పులను
తీర్పుగా ఇచ్చి మార్పును

అలవాటుచేసే తూర్పునకు

🌸🌸 సుప్రభాతం 🌸🌸


కామెంట్‌లు