అందుచేత విజయనగర చక్రవర్తి అచ్యుతదేవరాయలు తన పేర అచ్యుతరాయపురాన్ని నిర్మించి అందులో ఒక ఆలయం కట్టించి అచ్యుతరాయ పెరుమాళ్లును ప్రతిష్టించినట్లు చెప్పుకోవచ్చు అని గోపికృష్ణ గారు చెప్పారు గోవిందరాజస్వామి దేవాలయంలోని క్రీస్తు శకం 1736 నాటి శాసనం జి. టి 355 శ్రీ వేంకటేశ్వరుని తిరువడై యాట్టు (ఉత్సవ పూజాదికాలకై) సమర్పించబడిన గ్రామం అయిన కొత్తూరులో శ్రీ భండా రానికి 2400 నర్పనాలను చెల్లించి కొనుక్కొని ఆ భూమిలో అచ్చుత పెరుమాళ్లు ఆలయాన్ని నిర్మించాలని చెప్పబడింది ఆ దేవాలయం చుట్టూ 120 ఇళ్లను కట్టించి బ్రాహ్మణ అగ్రహారంగా ప్రకటించి దానికి తన పేరు అచ్యుతరాయపురం అని పేరు పెట్టారు. చరిత్ర సరే మరి ఆలయం ఇప్పుడు అక్కడ లేదు ఎక్కడికెళ్ళింది అని అడిగారు రెడ్డి గారు తిరుపతిలో కొత్త కొత్త కాలనీలు వచ్చి ఆలయాలు వాటి చుట్టుప్రక్కల గల భూముల్ని ఆక్రమించేస్తున్నారని అది గమనించిన తిథి దేవస్థానం అధికారులు ఆలయం శిథిలమై పోగా గోపురాన్ని జాగ్రత్తగా ఊడదీసి తిరుమల ఘాట్ రోడ్ లోని మోకాళ్ళ (చుక్కల) పర్వతం పైన గల అవ్వాచారి కోనలో నిర్మించాలని చెప్పారు ఆయనే లేకపోతే ఖాదీ కాలనీలోని గుడి గురించి నా రెడ్డి గారి ప్రశ్న శేష ప్రశ్న గానే మిగిలిపోయింది అంతలో పేట శ్రీ కనిపించారు ఏమన్నా ఇక్కడ ఉన్నారు అని అడిగారు జరిగిందంతా చెప్పగా ఆయన రెడ్డి గారికి తిరుమల తిరుపతిలో ఒకప్పుడు ఉండి ఇప్పుడు లేకుండా పోయిన అనేక అపురూప ఆలయాలు గురించి పూస గుచ్చినట్లు చెప్పాడు మళ్ళీ హోటల్కు తిరిగి వచ్చి వారి పాటికి వారు తయారైనారు. మళ్లీ ప్రయాణం మొదలు రమణగారు కూడా బీసీ హరికృష్ణ గారు కలిసి ముందుగా అనుమతి తీసుకుని పద్మావతి మహిళా విశ్వవిద్యాలయంలోని విజయనగర కాలం నాటి విశాలమైన దిగుడు బావిని చూడడానికి వెళ్లారు ఓ మహిళా వారిని సాధరంగా ఆహ్వానించారు కరోనా కాబట్టి కళాశాలలకు సెలవు అలికిడి లేదు బావిని పైనుంచి చూసారు.బావి అనేకంటే కోనేరు అని అనవచ్చునేమో ఎంత అపురూపంగా ఉందో భూమికి దాదాపు 30 అడుగుల లోతు నుంచి ముందుగా ఎనిమిది పలకల మెట్లు ఐదు వరసలు ఆ తర్వాత అరువైపులా మెట్లకు ఎదురుగా ఆలయాలు కోనేరు లోపలి అడుగుల స్తంభాలు వాటిపైన పుష్ప పోదికలు ఎంత ఆకర్షణీయంగా ఉన్నాయంటే అది చూసి తీరవలసినదే స్తంభాల పైన కప్పు దానిపైన పిట్ట గోడ చీల్చుకొని బయటకు వచ్చాయి నరసింహస్వామి విగ్రహం ఆప్స్ స్ట్రాక్టు ఆర్ట్ కు చక్కటి ఉదాహరణ.
అడుగుజాడల్లో ఆనవాళ్లు;- డా.నీలం స్వాతి,చిన్న చెరుకూరు గ్రామం,నెల్లూరు.6302811961.
• T. VEDANTA SURY

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి