ఆనందమూర్తి! యువత స్ఫూర్తి!;- డా. పి వి ఎల్ సుబ్బారావు,9441058797.
నా పంచ పదుల సంఖ్య---
===================
1118.
       వ్యావహారికంగా ,
           నరేంద్రనాథ్ దత్త,   
                  నామదేయుడు !
    
    యోగిగా విశ్వవిఖ్యాతుడైన,
          స్వామి వివేకానందుడు! 

    సద్గురువు,
       రామకృష్ణ పరమహంస ,
                   ప్రియ శిష్యుడు !

వేదాంత యోగ తత్వ శాస్త్రాల,
             అసమాన నిష్ణాతుడు!

  ఈ సమాజాన్ని మేల్కొలిపిన,
   ఆధ్యాత్మికనాయకుడు,
     పివిఎల్!

1119.
     విశ్వజన ఆకర్షణతో,
      మెరిసే నిందైన రూపము! 

సంబోధన చాలు శ్రోతలను, 
        కట్టివేసే ఉపన్యాసము! 

విషయం ప్రస్తుత పరిచే,  
    విధానం జన చైతన్యము! 

  హిందూ తత్వ భారత దేశ,   
    చరిత్ర విశేష జ్ఞానము! 

విశ్వమంతా ప్రతిధ్వనించిన, ఏకైక కంచు కంఠము, పివిఎల్!

1120.
గాంధీ, నేతాజీ ,అరబిందో,
ప్రభావిత నేతాగణము! 

జగమెరిగిన సోదరి నివేదిత- - - శిష్య బృందము!
 
రాజయోగ, ధర్మయోగ, భక్తీయోగ, సరి సృజనము! 

బేలూరు మఠం,
 రామకృష్ణ మఠం /మిషన్, స్థాపనము!

 అల్పాయువు,
 అనన్య జీవనం,
 భరతమాత పుణ్యము,
 పివిఎల్!

1121.
భారతదేశ ప్రాచీన, 
ఔన్నత్యము జీవితాశయము!

"గమ్యం చేరేవరకు ఆగవద్దు",
          ఓ దిశా నిర్దేశము!

"మందలో ఉండకు ,
వందలో ఉండాలి" సరికర్తవ్యం!

"కెరటం ఆదర్శం,
 లేచి పడు,పడిలేచు",   
 సందేశము!

వివేకం, ఆనందం ,
మిళిత జీవితం, యశోకారణము, పివిఎల్!
________


కామెంట్‌లు