ఏక సంధాగ్రాహి వేంకట రాజుగారు;- ఏ.బి ఆనంద్,ఆకాశవాణి,విజయవాడ కేంద్రం,9492811322.
 అతి కష్టం మీద రంభను స్వాధీన పరచుకున్న వ్యక్తి తన తపస్సమాధిలో కూర్చున్నప్పుడు ఊర్వశి వస్తుంది  ఊరువులను స్వాధీన పరచుకొని గజ్జల వరకు ఉన్న  శరీర భాగాన్ని తన అధీనంలోకి తెచ్చుకోవడానికి ప్రయత్నించే ముని  ప్రయత్నాన్ని భగ్నం చేస్తుంది  ఆమెను కూడా జయించిన తరువాత  మేనక ప్రవేశం మేను అంటే శరీరం  ఈ శరీరం మొత్తాన్ని తన స్వాధీనంలో ఉంచుకోవడానికి చేసే ప్రయత్నాల్లో  దానిని భగ్నం చేసేటటువంటి ప్రయత్నం మేనకది  ఆమెను కూడా జయించి  శరీరం మొత్తాన్ని తన అధీనంలోకి తెచ్చుకొని   కుండలితో ఓంకారాన్ని ప్రారంభించే ముందు  చివరి దశలో త్రిలోత్తమ  ప్రత్యక్షమవుతుంది  ఇది ఉత్తమ ఉన్నతమైన  నువ్వు గింజ అని అర్థం  ఓంకారాన్ని ప్రణవం చేయడానికి  ప్రయత్నం చేస్తుంది  దానిని కూడా చేయించినవాడు  ముని శ్వరునిగా మోక్షాన్ని తాను పొందుతారు. కుండలిని దగ్గర ప్రారంభమైన ఓంకారం  నీ మనసు అనగా వెన్నుపూస ద్వారా  ఒక్కొక్క వెన్నుపూసను చేదించుకుంటూ అరిషడ్ వర్గానికి దూరంగా వెళ్లిపోవడానికి ప్రయత్నం చేస్తూ చిన్న మెదడు వరకు  ప్రయాణం చేయడం  తరువాత భ్రుకుటి వరకు సొంతం చేసుకోవడం  ఆ తరువాత మెదడును స్వాధీనం చేసుకోవడం అక్కడ కపాలానికి చేరడానికి  కపాలానికి మెదడుకు మధ్య ఉన్న  ఖాళీ స్థలం చీకటిని చేర డానికి  మెదడుపై ఉన్న తెల్లటి పొర అడ్డు వస్తుంది  దానినే త్యాగరాజస్వామి  తెర తీయగ రాదా మత్సర మను తెర తీయగ రాదా అని అందమైన కీర్తన మనకు అందించారు  ఎంతో అర్థవంతమైన వేదాంతం కలిగిన కీర్తన వారి సాధనలో శ్రీరామచంద్రమూర్తిని దర్శనం కోసం చివరి ప్రయత్నం  అలా ఆ చీకటిలోకి ప్రవేశిస్తుంది ముని మనసు మన పెద్దవాళ్లు  తమసోమా జ్యోతిర్గమయా అన్న  ఉపనిషత్ వాక్యాన్ని చెబుతూ ఉంటారు  నీకు వెలుగులో ఉన్న ఆనందం తెలియాలి అంటే అసలు చీకటి ఏమిటో ముందు నీకు తెలియాలి  అప్పుడు ఆ పూర్తి ఆనందాన్ని ఆస్వాదించడానికి అవకాశం కలుగుతుంది  అని ఎలాంటి వేదాంత అర్థాలను తెలియజేస్తూ ఉంటారు  ఏమునిని రుషిని కదిరించిన  ఈ విషయాన్ని గురించి తెలియజేస్తారు  ముని మౌనంగా ఉంటాడు  తన కార్యక్రమాలను చేసుకుంటూ వెళతాడు  రుషి అంటే చెరించు వాడు  తాను ఎలా నడుచుకుంటూ ఉంటాడో 
శిష్యులు కూడా అదే మార్గాన్ని అనుసరించి వెళ్లడం ఋషి మార్గం  ఆ తర్వాత మహర్షి రాజర్షి ఋషి లాంటి సాధనలు అనేకం ఉన్నాయి  అవన్నీ ఆచరణలో తెలుస్తాయి  ఏదైనా చెప్పడం కాదు చేయడం  దానిలో విజయాన్ని సాధిస్తే జీవితంలో అతను కృతకృత్యుడవుతాడు.


కామెంట్‌లు