ఏక సంధాగ్రాహి వేంకట రాజుగారు;- ఏ బి ఆనంద్,ఆకాశవాణి,విజయవాడ కేంద్రం9492811322.
 మంచుతో కప్పబడి ఉన్న  హిమవత్ పర్వతం సీతారామరాజుకు వెండి కొండ లాగా  ఆ వెన్నెలలో కనిపించింది  ఏడు గుర్రములతో రథమును  నడిపించగల సామర్థ్యం గల సూర్యుడు  ఈ ఇంద్రధనస్సు లాగా  అనిపించింది  యుద్ధానికి సిద్ధములైన యోధుల వలె తీర్చిదిద్దబడిన ఆ గిరి శిఖరాలపై  ఎన్నో చెట్లు బారులు తీరి ఉన్నాయి  ఆ కొండ చివర నుంచి సెలయేరు దూకుతూ ఉంటే దాని ఉధృతమైన ధ్వనికి కర్ణభేరి పగిలిపోతుంది ఏమో అనిపించింది రాజుగారికి  ఇవన్నీ భగవంతుడు సృష్టించిన  ఔషధ గుణాలతో తీర్చిదిద్దబడిన  లతలకు కాణాచి రాత్రి పగలు అవి అలా వెలుగుతూనే ఉన్నాయి  మనిషి లాంటి మహనీయ ధాతువులతో  ఈ హేమ పర్వతం దేవభూమిగా  తేజరిల్లుతోంది అనుకున్నారు రాజుగారు.దీక్షతో దేశమంతా తిరిగి తిరిగి  చివరకు కృష్ణ దేవి పేట చేరాడు దప్పి కొనడంతో ఒక ఇంటి ముందు ఆగి దాహం తీర్చమని అడిగినప్పుడు ఆ గృహస్తు మజ్జిగ అందించారు  ఇతను ఎక్కడ వాడు ఎందుకు ఇక్కడికి వచ్చాడు ఇలా తిరిగి తిరిగి ఏం చేస్తాడు  అతని శరీరం చూస్తూ ఉంటే ఎంతో తేజస్సుతో బాల భాస్కర్ లాగ కనిపిస్తున్నాడు  మొహం చూస్తే పాలు కారుతున్నట్టుగా ఉంది ఈ చక్కని కుర్రవాడికి  ఇలా అడవులలో గుట్టలలో సంచరించవలసిన అవసరం ఏమొచ్చింది అని మనసులో అనుకుని  ఆ గృహస్థు మీరు ఎక్కడి వారు ఎక్కడికి వెళుతున్నారు  మీరు ఎక్కడ ఉంటారు అని అనేక రకాలుగా ప్రశ్నలను గుమ్మరిస్తే నాకిక్కడ  తప్ప తపస్సు చేసేటువంటి స్థలం కనిపించడం లేదు  సన్యసించి నేను ఇక్కడికి వచ్చాను. నేను తప్పస్సమాధిలో నిమగ్నమై ఉండడానికి తగిన స్థలం కోసం వెతుకుతున్నాను అని తన మనసులోని మాట చెప్పాడు  ఆ మాటలన్నీ ఎంతో జాగ్రత్తగా విన్న ఆ  గృహస్తు  ఎంతో ముచ్చటపడి  మా ఇంట కాసేపు కూర్చో విశ్రాంతి తీసుకో  నా పేరు చిటికెల భాస్కరుడు  నాదొక చిన్న విన్నపం  తెలిసినది చెపుతాను అని  మీరు తపస్సు చేసుకోవడానికి యోగ్యమైన స్థలం ధారకొండ మాత్రమే  అది నీకు తగినది  పాలకొండ పైన నీటి ధారలు ఉన్నాయి  పనస మామిడి అరటి  అన్ని కాలాలలోనూ దొరుకుతాయి అది నీకు ఎంతో అనువుగా ఉంటుంది  అక్కడ తపస్సు చేసే నీకు రక్షణగా కూడా ఉంటుంది  అక్కడ చేయడానికి నీవు అంగీకరించినట్లయితే నీకోసం నేను పర్ణశాల ఒకటి నిర్మించి ఇస్తాను  అని చెప్పాడు ఆ గృహస్తు.



కామెంట్‌లు