నసీమ జగ్గన్నతోట ప్రభ తీర్థం; -"కవి మిత్ర" శంకర ప్రియ.,-సంచార వాణి:- 99127 67098
  🙏నవ్య దివ్య ప్రభలతో
     ప్రకాశించు పర్వదినం
     కోనసీమ "జగ్గన్నతోట 
     ప్రభ తీర్థం"! ఓ సుమతీ!
🙏భారతీయ సంస్కృతికి
      సమిష్టి జీవనం నకు
      ప్రతీకలు పండుగలు!
      తీర్థములు! ఓ సుమతీ!
              [అష్టాక్షరీ గీతి., శంకర ప్రియ.,]
🙏జగ్గన్నతోట ప్రభ తీర్థం.. అత్యంత ప్రాచీనమైనది! అది..17వ శతాబ్దం నుంచి జరుగుచున్నది! తూర్పు గోదావరి జిల్లా... "కోనసీమ"లోని అంబాజీపేట మండలం, మొసలపల్లి శివారు గ్రామము "జగ్గన్నతోట"! అక్కడ కొబ్బరితోటలో.. ఉత్తరాయణ పుణ్యకాలంలో .."సంక్రాంతి" మర్నాడు "కనుమ"పండుగ రోజున...  "ప్రభ తీర్థం" నిర్వహిస్తారు!
      ఇందులో.. శ్రీమన్మహాదేవుని, శివునియొక్క ఏకాదశ రుద్రాoశ సంభూతులు  కొలువుదీరి; భక్తులను అనుగ్రహిస్తారు!
🙏ఏకాదశ రుద్రులు... ప్రభలు తీర్థం:-  
🔱01). వ్యాఘ్రేశ్వరం నుండి, శ్రీబాలా త్రిపురసుందరీ సమేత, శ్రీవ్యాఘ్రేశ్వర స్వామివారు
🔱02). పెదపూడి నుండి, శ్రీపార్వతీసమేత, శ్రీమేనకేశ్వరస్వామివారు
🔱03). ఇరుసుమండ నుండి, శ్రీబాలాత్రిపుర సుందరీసమేత, శ్రీఆనంద రామేశ్వరస్వామి వారు
🔱04). వక్కలంక నుండి, శ్రీఅన్నపూర్ణాసమేత, శ్రీవిశ్వేశ్వర స్వామివారు
🔱05). నేదునూరు నుండి, శ్రీసర్వమంగళ సమేత,  శ్రీఉమా చెన్నమల్లేశ్వరస్వామివారు
 🔱06). ముక్కామల నుండి, శ్రీబాలా త్రిపురసుందరీసమేత, శ్రీరాఘవేశ్వరస్వామ వారు
🔱07). మొసలపల్లి నుండి, శ్రీఉమాసమేత, అనంత భోగేశ్వరస్వామి వారు
🔱08). పాలగుమ్మి నుండి, శ్రీశ్యామలాంబా సమేత, శ్రీచెన్నమల్లేశ్వర స్వామివారు
🔱09). గంగలకుర్రు అగ్రహారం నుండి, శ్రీఉమా పార్వతీసమేత, శ్రీవీరేశ్వర స్వామివారు
🔱10). గంగలకుర్రు నుండి, శ్రీసర్వమంగళ పార్వతీ సమేత, శ్రీచెన్నమల్లేశ్వర స్వామివారు
🔱11). పుల్లేటికుర్రు నుండి, శ్రీబాలా త్రిపురసుందరీ సమేత, శ్రీఅభినవ వ్యాఘ్రేశ్వర స్వామివారు
    .... మున్నగువారు.. ఏకాదశ (11) రుద్ర ముర్తులు! శ్రీ స్వామివార్లను భక్తమహాశయులందరు సర్వాంగ సుందరంగా అలంకరిస్తారు! అట్లే, ప్రభలు కట్టుకొని.. జగన్నతోట ప్రభ తీర్థంనకు  తీసుకువస్తారు! అక్కడ శ్రీస్వామివారలను.. సందర్శకులందరూ భక్తిప్రపత్తులతో సేవించుకొoటారు!
⚜️ప్రధానమంత్రి మోదీజీ సందేశం:-
       "జగ్గన్నతోట ప్రభ తీర్థం ... భారతీయ సంస్కృతికి ప్రతీక! దీనిని ప్రజలందరూ.. ఆనందోత్సాహములతో జరుపుకోవాలి!"అని ప్రధాని, నరేంద్ర మోదీజీ అభినందించారు! 
        🪷తేట గీతి పద్యం 
      ప్రభల తీర్థము సంక్రాంతి ప్రాభవమును 
వ్రాయుటకు రాదు, చూచి తీరంగ వలయు
     పదునొకండ్రయి రుద్రులు ప్రభల మీద
వెలసి “జగ్గన్నతోట”న కొలువు దీరి
     దర్శనము నిత్తు రెల్లర తనివి తీర
మకరసంక్రాంతి శోభలు మరువ గలమె! 
      [రచన:- శ్రీవేదుల సుబ్రహ్మణ్యo., ]

కామెంట్‌లు