"ఏ" పద గేయం;- -గద్వాల సోమన్న,9966414580
ఏకీభావం ఉండాలి
ఏకతాటిపై నడవాలి
ఏడ్చే వారికి మాత్రం
ఓదార్పుగా మారాలి

ఏకాగ్రతే వహించాలి
ఏక దృష్టి కల్గియుండాలి
ఏరు పరుగులా సాగాలి
ఏటి గట్టుపై నడవాలి

ఏకపత్ని పురుషుడవ్వాలి
ఏలిక వోలె జీవించాలి
ఎన్ని అవరోధాలెదురైనా
ఏకంగా పోరాడాలి

ఏకవీర రీతి మసలాలి
ఏకలవ్యులూ కావాలి
ఏకాంతంగా భగవంతుని
ఏమారక ధ్యానించాలి


కామెంట్‌లు