నిజమే కదా!...;- -గద్వాల సోమన్న,9966414580
పరిమళాలే లేకున్న
పూవులతో పనియేమి?
సుగుణాలే లేకున్న
సొగసులతో లాభమేమి?

సంస్కారమే లేకున్న
చదువులతో ఫలమేమి?
సత్క్రియలే చేయకున్న
చేతులతో సుఖమేమి?

పలకరింపు లేకున్న
నాలుకతో  మేలులేమి?
చిరునవ్వులు చిందకున్న
ముఖములతో ముచ్చటేమి?

ప్రేమలే విరియకున్న
మనసులతో క్షేమమేమి?
మంచితనం కురియకున్న
జన్మతో ఫాయిదా ఏమి?


కామెంట్‌లు