చిరస్మరణీయుడు;- కంచనపల్లి ద్వారకనాథ్,B.A.,B.F.A-చరవాణి:9985295605.,7981499423
కలకత్తాలో 
మకరసంక్రాంతి పర్వదినాన  జన్మించి 
 తల్లితన మొదటి గురువై , 
భారత, రామాయాణ, ఇతిహాసములు అభ్యసిస్తూ 
 దినదినవర్ధమానుడైనాడు నరేంద్రుడు 
తన అంతరాత్మలో అనూహ్యమైన 
ఎన్నో ఆధ్యాత్మిక   సందేహాలను 
తర్క జ్ఞానమార్గంలో  అన్వేషణా జిజ్ఞాసుడై 
 పరమాత్మతత్వాన్ని తెలుసుకునే మార్గంలో 
పరమహంసకు శిష్యుడై   పరవశించి  పోయి వివేకానందుడైనాడు 
సర్వధర్మ స్వరూపమే  వేదాంత సారమని నమ్మి 
 హిందూభావకుడై భిన్నత్వంలో ఏకత్వం సాధించాలని  
తన   ప్రసంగాలలో భారతీయ సనాతన సంస్కృతి ధర్మాలను 
దేశ విదేశాలకు చాటిచెప్పిన పరివ్రాజకుడు అతడు 
తనప్రసంగాలతోబలహీనతే మరణిండమని ,బలమే జీవితమని యువతను  మేల్కొపడానికి చైతన్య పుంజమై   ఆవర్భవించిన దివ్వె అతడు  
విగ్రహారాదికులను విమర్శించి ,అద్వైత్వాన్ని వ్యతిరేకించిన తత్వ వేత్త అతడు 
చికాగో ప్రసంగంలోప్రజల మనోమందిరాలల్లో
స్నేహ  సౌరభ విరాజితాలుపూయించిన  మేథావి అతడు 

భవిష్యతరాలకు మార్గదర్శిగా ప్రపంచ చరిత్రలో
చిరస్మరనీయుడై అతని భావాలు మేల్కొల్పుతూనే వుంటాయి      
 త్రివేణీ సంగమక్షేత్రంలో
నల్ల చలువరాతితో  నిర్మించిన  వివేకానంద స్మారక   చిహ్నం 
 ఉదధి అలల్లో  ఆధ్యాత్మిక   భావాలు కలిగిస్తూనే వుంటాయి ! 
 
[జనవరి 12  న వివేకానందుని  జన్మదినం ] 

కామెంట్‌లు