మనుష్యుల్లో నశిస్తోంది మానవత్వం
అడుగంటిపోతున్న ఆప్యాయతలు
నోటు కాగితాలే గమనాన్ని శాసిస్తుంటే
మరబొమ్మల్లా మారుతున్న మానవులు
నకిలి నోటులా మనస్థత్వం
గుండెల్లో మోడుబారుతున్న కరుణ
అవసరార్ధం కోసమే మనష్యులు
స్పందించే హృదయం మోడైపోతోంది
మతం కంటే గొప్పది మానవత్వం
చూడగలిగితే ప్రతీ జీవిలో దైవత్వం
మానవత్వమే జీవితానికి పునాది
మానవత్వం లేని మేధస్సువ్యర్ధం
మేధస్సు లేని మానవత్వం ఉన్నతం.
మానవత్వం పొంగిపొర్లితే
దైవత్వమే వెతుక్కుంటూ వస్తుంది.
ఉన్నతమైన విలువలే మనిషిగా నిలబెట్టేవి
మానవత్వం వైపు నడిపిస్తాయి
అమూల్యమైనవి అపురూపమైనవి
జటిలమైన సమస్యలకు పరిష్కారం చూపిస్తాయి
డబ్బులకు దాసోహం కానివి
మానవత్వం చేతల్లో ప్రతిఫలిస్తే
ఎందరి జీవితాలలోనో ఆనందపు కాంతులు
మానవత్వం వికసించేలా
మంచితనం పరిమళించేలా
మనిషి మనుగడ ఉజ్వలించేలా
ప్రతీ ఒక్కరి అడుగు ముందుకు పడాలి

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి