న్యాయాలు -369
ఆఖ్వన్న పిట న్యాయము
******
ఆఖు అంటే ఎలుక.అన్న అంటే అన్నము ఆహారము. పిటము అంటే గంప,తట్ట,పాత్ర లేదా బుట్ట.
ఎలుక పొయ్యి మీద ఉన్న అన్నపు పాత్రను కిందకు పడదోస్తుంది.కానీ మళ్ళీ ఆ పాత్రను పొయ్యి మీద పెట్టలేదు.అంటే పడదోయడమే అంటే చెడగొట్టడమే తెలుసు కానీ తిరిగి సరి చేయడం దాని వల్ల కాదు.
అలాగే కొందరు మంచిగా ఉన్న వాటిని అంటే వస్తువులు,పనులే కావచ్చు లేదా కుటుంబాలనే కావచ్చు.. వాటిని పాడుచేస్తుంటారు.తిరిగి వాటిని బాగు చేయడం,చక్కదిద్దడం వారికి చేత కాదు.ఇలాంటి వాటికి సంబంధించిన అర్థంతో ఈ ఆఖ్వన్న పిట న్యాయమును వర్తింప చేసి చెబుతుంటారు.
ఇలా చేయడం వల్ల వారికి ఒనగూరే లాభం ఏమైనా ఉందా? అంటే ఏమీ లేదు. మంచి వారిని,మంచి వాటిని చెడగొట్టడం తప్ప.
అందుకే భాస్కర శతక కర్తైన మారద వెంకయ్య గారు ఓ పద్యంలో ఇలా అంటారు.
"ఊరక సజ్ఝనుండొదిగియుండిన నైన దురాత్మకుండు ని/ష్కారణ మోర్వలేక యపకారము చేయుట వాని విద్యగా/చీరెలు నూఱు టంకములు చేసెడి వైనను బెట్టెనుండగా/జేరి చినింగి పోగొరుకు చిమ్మటకేమి ఫలంబు భాస్కరా!"
అంటే మంచివాడు తన మానాన తాను ఎంత ఒదిగి వున్ననూ దుర్మార్గుడు ఓర్వలేక అతడికి అపకారం తలపెడతాడు.దీనివల్ల అతడికి వచ్చే లాభం ఏమీ లేదు.
అదెట్లా అన్నదాన్ని ఇదిగో ఇలా చెప్పిన చక్కని పోలిక చూడండి.
పెట్టెలో దాచుకున్న నూరు టంకములు ( అప్పటి రూపాయలు పెద్ద మొత్తంలో) అనగా ఎంతో డబ్బు పెట్టి కొన్న ఖరీదైన చీరలను చిమ్మెట పురుగు కొరికి పాడుచేస్తుంది కదా!"అలా చేయడం వల్ల దానికి ఎలాంటి లాభం లేదు అని అర్థం.
దుష్ట బుద్ధి కలవారూ అంతే. తాము ఎలాగూ మంచిగా ఉండరు. మంచిగా ఉన్న వారిని సైతం మంచిగా ఉండనివ్వరు.
దీనినే తెలుగులో "తా చెడ్డ కోతి వనమెల్లా చెరిచింది " అంటారు. అది చెడిపోయిందే కాకుండా కనిపించే మంచినీ చెడగొడుతుందన్న మాట.
ఇలా తాము ఎలాగూ మంచి చేయకపోగా , మంచిగా ఉన్నవాటిని, ఉన్న వారిని చెడగొట్టడమే కానీ బాగు చేయలేని వారికి ఈ ఆఖ్వన్న పిట న్యాయమును పోల్చితే సరిగ్గా సరిపోతుంది.
ప్రభాత కిరణాల నమస్సులతో🙏

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి