ముగ్గుల పోటీలో విజేత ఎస్. రత్నలక్ష్మి

 తెలుగు వెలుగు సాహిత్య వేదిక వారి ఆధ్వర్యంలో సంక్రాంతి పండుగ సందర్భంగా నిర్వహించిన రంగవల్లుల పోటీలో నంద్యాలలోనీ జలవనరుల శాఖలో తెలుగుగంగ ప్రాజెక్టునందు అసిస్టెంట్ ఇంజనీరుగా ఉద్యోగం చేస్తున్న ఎస్. రత్నలక్ష్మి పాల్గొని సంక్రాంతి పండుగ ప్రాముఖ్యతని మరియు పర్వదిన విశేషాలని ముగ్గులో ఇమిడ్చి సంక్రాంతి వైశిష్ఠ్యాన్ని ప్రతిఫలింప చేయడమే గాక,  పలు ఆకర్షణీయమైన రంగులతో న్యాయ నిర్ణేతలను సైతం ఆకట్టుకునే విధంగా మనోరంజకంగా తీర్చిదిద్దినందుకు తెలుగు వెలుగు సాహిత్య వేదిక వ్యవస్థాపకులు మరియు న్యాయ నిర్ణేతలు  ఎస్. రత్నలక్ష్మిని విజేతగా ప్రకటించారు. ఈ సందర్భంగా బంధుమిత్రులు, సహోద్యోగులు, పలువురు కవులు కవయిత్రులు అభినందనలు అందజేశారు.
కామెంట్‌లు