తిరుప్పావై ; - వరలక్ష్మి యనమండ్ర-అద్దంకి, బాపట్ల జిల్లా
18వ పాశురము, 
**********
ఉన్దు మదకళిత్త నోడాద తోళ్ వలియన్ నన్దగోపాలన్ మరుమగళే! నప్పిన్నాయ్! కన్దమ్ కమళుమ్ కుళలీ! కడై తిఱవాయ్; వన్దెఙ్గమ్ కోళియళైత్తగాణ్; మాదవి ప్పన్దల్ మేల్ పల్ కాల్ కుయిలినఙ్గళ్ కూవినగాణ్; పన్దార్ విరలి! ఉన్ మైత్తునన్ పేర్ పాడ, చ్చెన్దామరైక్కెయాల్ శీరార్ వళైయొలిప్ప వన్దు తిఱవాయ్ మగిళ్ న్దు ఏలో రెమ్బావాయ్,
***********
  భావము.....పంచపదులలో
***********
18 వ పాశురము భావము

చక్కగ  నీవు పాటలు పాడేవు
అందముగా నీవు నడిచెదవు
నీ నడకలు నెమళ్ళకు నేర్పెదవు
నీ పాటలు కోయిలలకు నేర్పెదవు
నువు గడసరి దానవు ఓ నీలమ్మా... కృష్ణా

లోకపావనిని కాచే దానవు నీలమ్మా
నందగోపునీ కోడలివమ్మా ఓ నీలమ్మ
మామ కీర్తికీ పొంగేదానా ఓ నీలమ్మ
జగతిని బంతిని చేసిన దానా నీలమ్మా
ప్రభువును కొలువగ వచ్చితిమమ్మా... కృష్ణా

‌స్వామితో ఆటలు ఆడే ఓ నీలమ్మా
నీ రక్షణలో స్వామిని ఉంచిన నీలమ్మా
స్నానవ్రతమును చేయగవస్తిమి నీలవేణీ
నీ కర కంకణ శబ్దముల తోటి ఓ నీలవేణీ
వేగమె తలుపును తీయుమా ఓ నీలవేణీ... కృష్ణా 


నల్లని చక్కని కురులున్నదానా నీలమ్మా
శ్రీరాముడెంతో ఆదర్శ వంతుడు నీలమ్మా
శ్రీకృష్ణుడెంతో తేజోవంతుడుగ ఓ నీలమ్మా
కొక్కొరొకో యని కోళ్ళుకూసెను నీలమ్మా
నిద్దుర వీడీ తలుపు తీయుమా నీలమ్మా.. కృష్ణా
**********


కామెంట్‌లు