1)
ముదముతోడ జనులు ముదమార ఓటేసి
ముదివగ్గులగుచును వడలిపోతున్నారు
సీటునందినవారు సిగ్గు ఎగ్గులులేక
భోక్తలై బొజ్జలు తడుముకుంటున్నారు!
2)
పార్లమెంటు నుండి పంచాయితీ వరకు
పిచ్చికుక్కలకంటె హీనమై హోరుతో పోరుచేసి,
మైకులు విరిచేసి,పోడియమును పొడిచేసి
వైరిపక్షాల మట్టికరిపింపజేసిన యోధులండి!
3)
గడ్డి మేయునొకడు నీళ్ళు త్రాగునొకడు
ఫ్యాక్టరీలు రోడ్లు మ్రింగువాడొకడు
మారణాయుధాలు మాయంజేయు నొకడు
బ్యాంకులోని డబ్బుతో బ్రేవుమను నింకొకడు!
4)
మాంత్రికులను,తాంత్రికులను,రౌడీలను,గూండాలను,
హంతకులను,మాఫియాలను,
సారాజులైన ఇష్టులను,
మరి ఫ్యాక్షనిష్టులను,'రియల్' ఇష్టులను
సాకుచున్నారు ఏలికలు సిగ్గు ఎగ్గులు విడిచి!
5)
ప్రజాప్రతినిధులు ప్రతి 'నిధి' ని మింగేరు
ఏ పార్టి అయితేమి? ఏ నేత అయితేమి?
గోతికాడి నక్కకు ఏమూలనైతేమి?
కారు లీడర్లు మనపాలి "మర్మసక్కర్లు" వీరు !!!
**************************************
ముదముతోడ జనులు ముదమార ఓటేసి
ముదివగ్గులగుచును వడలిపోతున్నారు
సీటునందినవారు సిగ్గు ఎగ్గులులేక
భోక్తలై బొజ్జలు తడుముకుంటున్నారు!
2)
పార్లమెంటు నుండి పంచాయితీ వరకు
పిచ్చికుక్కలకంటె హీనమై హోరుతో పోరుచేసి,
మైకులు విరిచేసి,పోడియమును పొడిచేసి
వైరిపక్షాల మట్టికరిపింపజేసిన యోధులండి!
3)
గడ్డి మేయునొకడు నీళ్ళు త్రాగునొకడు
ఫ్యాక్టరీలు రోడ్లు మ్రింగువాడొకడు
మారణాయుధాలు మాయంజేయు నొకడు
బ్యాంకులోని డబ్బుతో బ్రేవుమను నింకొకడు!
4)
మాంత్రికులను,తాంత్రికులను,రౌడీలను,గూండాలను,
హంతకులను,మాఫియాలను,
సారాజులైన ఇష్టులను,
మరి ఫ్యాక్షనిష్టులను,'రియల్' ఇష్టులను
సాకుచున్నారు ఏలికలు సిగ్గు ఎగ్గులు విడిచి!
5)
ప్రజాప్రతినిధులు ప్రతి 'నిధి' ని మింగేరు
ఏ పార్టి అయితేమి? ఏ నేత అయితేమి?
గోతికాడి నక్కకు ఏమూలనైతేమి?
కారు లీడర్లు మనపాలి "మర్మసక్కర్లు" వీరు !!!
**************************************

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి