🌻 శ్రీ శంకరవిరచిత🌻
మహీం మూలాధారే కమపి మణిపూరే హుతవహం
స్థితం స్వాధిష్ఠానే హృది మరుతమాకాశముపరి ।
మనోఽపి భ్రూమధ్యే సకలమపి భిత్వా కులపథం
సహస్రారే పద్మే సహ రహసి పత్యా విహరసే ॥ 9 ॥
సుధాధారాసారైశ్చరణయుగలాంతర్విగలితైః
ప్రపంచం సించంతీ పునరపి రసామ్నాయమహసః ।
అవాప్య స్వాం భూమిం భుజగనిభమధ్యుష్టవలయం
స్వమాత్మానం కృత్వా స్వపిషి కులకుండే కుహరిణి ॥ 10 ॥
,9) జగన్మాతా! భగవతీ! నీవు మూలాధారం ఉన్న పృథ్వి తత్వమును దాటి, మణిపూరమునందన్న జలతత్వమును దాటి, స్వధిస్టాన చక్ర మందున్న అగ్ని తత్వమును దాటి, అనాహత చక్రము నందు న్న వాయు తత్వమును దాటి, విశుద్ధి చక్రము నందున్న ఆకాశ తత్వమును దాటుకొని, ఆజా చక్రము నందున్న మనస్తత్వమును దాటి ,సుషుమ్న
మార్గమును ఛేదించి సహస్రారకమలము నందున్న
నీ భర్తయగు సదాశివుడితో కూడి ఉన్నావు!
10)
అమ్మా! పాద పద్మముల మధ్య నుండి ప్రవహించిన అమృత ధారా వర్షములతో దెబ్బది రెండు వేల నాలుగు ప్రపంచములను తడుపుతూ తిరిగి అమృతా తసశయము గల చంద్రుని కాంతి కలిగి మరల మూలాధార చక్రమున చేరి స్వస్వరూపముతో చుట్టలు గా చుట్టుకొని కుండలినీ శక్తివై నిద్రించుచున్నావు.!
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి