41)మహాస్వనః -
దివ్యనాదము స్వరూపుడు
గంభీరమైతోచు దివ్యుడు
వేదములకు ప్రమాణమైనవాడు
మహాస్వన నామమున్నవాడు
శ్రీ విష్ణు సహస్రనామాలు ఉమా!
42)అనాది విధనః -
ఆదిఅనునది లేనట్టివాడు
అంతమే ఎరుగనట్టివాడు
నిధనము లేకుండువాడు
నాశనమెరుగని నిత్యాత్ముడు
శ్రీ విష్ణు సహస్రనామాలు!ఉమా!
43)ధాతాః -
బ్రహ్మదేవునికి జనకుడు
నామరూపాత్మకుడైనవాడు
చరాచర విశ్వ ధారకుడు
స్వామి తానే మహనీయుడు
శ్రీ విష్ణు సహస్ర నామాలు ఉమా!
44)విధాతా -
బ్రహ్మను సృజంచినవాడు
తగురీతి కర్మఫలమిచ్చువాడు
విశ్వమునే ఆజ్ఞాపించువాడు
సర్వప్రకృతికి ఆదేశపరుడు
శ్రీ విష్ణు సహస్ర నామాలు ఉమా!
45)ధాతురుత్తమః -
బ్రహ్మకన్ననూ మహాశ్రేష్ఠుడు
సర్వదేవతలకునూ ముఖ్యుడు
సమస్త ధాతువుల్లో ఉన్నవాడు
ప్రధానముగాను నిలుచువాడు

సహస్ర నామాలు హృదయ పూర్వక అభినందనలు మేడం
సహస్ర నామాలు హృదయ పూర్వక అభినందనలు మేడం
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి