19 వ పాశురం-
కుత్తువిళక్కెరియ క్కోట్టుక్కాల్ కట్టిల్ మేల్ మెత్తెన పఇ్యశ యనత్తిన్ మేలేఱి, కొత్తలర్ పూఙ్కుళల్ నప్పిన్నై కొజైమేల్ వైత్తుక్కి డన్దమలర్ మార్ పా! వాయ్ తిఱవాయ్ మైత్తడ జ్కణ్నినాయ్ నీ యున్మణాళనై ఎత్తనై పోదుమ్ తుయిలెళ వొట్టాయికాణ్ ఎత్తనై యేలుమ్ పిరివాత్తగిల్లాయాల్ తత్తువ మన్హుతగవేలో రెమ్బావాయ్
**********
భావము---పంచపదులలో
**********
19 వ పాశురము భావము
నల్లని కాటుక కన్నుల దానా నీలమ్మా
కరుణామయివీ,దయగలదానవు నీలమ్మా
నీ సిగ పువ్వులు పరిమళ భరితము నీలమ్మా
స్నానవ్రతమును చేయగ వస్తిమి ఓ నీలమ్మా
మేన మరదలా తలుపుతీయవే ఓ నీలమ్మా.!... కృష్ణా
మెత్తని పడకపై హాయిగ యుంటివా నీలమ్మా
మాపై నీదయ చూపించమ్మా నీలమ్మా
నిను క్షణమైనా వీడనివ్వవుగా ఓ నీలమ్మా
మెల్లగ లేచి తెరను తీయుము ఓ నీలమ్మా!... కృష్ణా
దీపపు కుందులు వెలుగుచున్నవీ నీలమ్మా
స్వామి మాతో మాటాడరాదా ఓ నీలమ్మా
సుకుమారివీ సుందరి రూపిణవి నీలమ్మా
నీ రూపం స్వభావం పొంతనలేవు ఓ నీలమ్మా
మంచము దిగుము తలుపుతీయుము నీలమ్మా!... కృష్ణా
(నీలాదేవియే నీలమ్మ. ఈమె విష్ణువు భార్యలలో ఒకరు. ఈమెయే నాగ్నజితి అని అందురు.)
(సేకరణ)
***********
వరలక్ష్మి యనమండ్ర
*

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి