న్యాయాలు -382
అయస్కాంత సూచీ న్యాయము
*****
అయస్కాంతము అనగా సూదంటుఱాయి. సూచీ అనగా సూది.
సూదంటుఱాయి సూదిని చటుక్కున ఆకర్షిస్తుంది అనీ,సూది సూదంటురాయికి అదే విధంగా ఆకర్షింప బడుతుందని అర్థము.
సూదంటురాయి అనేది ఒక సహజమైన అయస్కాంతము.ఇది మాగ్నటైట్ అనే ఇనుప ఖనిజము.ఈ సూదంటుఱాయిని ఆంగ్లంలో మాగ్నెట్ అని పిలుస్తారు.ఇది ఒక పదార్థము అని కూడా అంటారు.దీని చుట్టూ అయస్కాంత క్షేత్రం వుంటుంది.ఈ పదార్థము ఉత్తర ధృవం, దక్షిణ ధృవం అనే రెండు ధృవాలను కలిగి ఉంటుంది.ఆకర్షణకు సంబంధించిన బలమైన అయస్కాంత బలం కలిగి వుంటుంది.
ఈ అయస్కాంతములలో మూడు రకాల అయస్కాంతాలు వున్నాయి.శాశ్వత అయస్కాంతాలు, తాత్కాలిక అయస్కాంతాలు మరియు విద్యుదయస్కాంతాలు.శాశ్వత అయస్కాంతం యొక్క అయస్కాంతత్వము విద్యుత్ బాహ్య మూలం అవసరం లేకుండానే అయస్కాంత క్షేత్రాన్ని విడుదల చేస్తుంది.
అనగా భగవంతుడికి భక్తుడికి మధ్య శాశ్వతమైన అయస్కాంత బంధం అలా ఉండాలని, ఉంటుందని చెప్పడమే ఈ "అయస్కాంత సూచీ న్యాయము "లోని అంతరార్థం.
ఇను మయస్కాంత సన్నిధి నెట్లు భ్రాంత, మగు హృషీకేశుసన్నిధి నా విధమున గరగుచున్నది దైవ యోగమున జేసి, బ్రాహ్మణోత్తమ! చిత్తంబు భ్రాంతి మగుచు "
"అనగా ఇనుము అయస్కాంతం వైపు ఆకర్షింపబడినట్లు దైవ యోగం వల్ల నా మనస్సు ఆ శ్రీహరి వైపు ఆకృష్టమై ఆయన సన్నిధిలోనే విహరిస్తున్నది. మరి ఏ విషయంలోనూ నా మనసు నిలవటం లేదు" అని ప్రహ్లాదుడు తన గురువుతో అంటాడు. ఈ మాట భాగవతంలోని సప్తమ స్కంధములో వుంది.
శ్రీ రామకృష్ణ పరమహంస నరుడికి నారాయణుడికి మధ్య ఉన్న సంబంధం ఇనుముకు సూదంటురాయికి గల సంబంధం లాంటిదనే అంటారు.అయితే నరుడు సూదంటురాయి లాంటి నారాయణునిచే ఎందుకు ఆకర్షింపబడటం లేదు అనే సందేహము భక్తులకు వస్తుంది. మట్టిలో కప్పబడటం వల్ల ఇనుము సూదంటురాయిని ఆకర్షింపలేనట్లుగా మనిషి కూడా మహా మాయచే కప్పబడి వుండటం వల్ల నారాయణుడి ఆకర్షణను పొందలేక పోతున్నాడు.కాబట్టి మాయలాంటి మట్టిని కడిగేసుకుంటే ఆ నారాయణునిచే ఆకర్షింపబడతాడని చెప్పారు.
అంటే భక్తుని యొక్క హృదయము పూర్తిగా భగవంతునితో నిండిపోయినప్పుడు మాత్రమే భక్తుని మనస్సు భగవంతునికి సూదంటురాయి సూదిని ఆకర్షితమైనట్లు ఆకర్షింపబడుతుందని, ఇది నవ విధ భక్తి దశలలో ఒకటని చెప్పడం జరిగింది.
ఒక సూదిని అయస్కాంతముతో రుద్దితే కొంత సమయానికి అయస్కాంతము యొక్క గుణాలు సూదికి అబ్బుతాయి.అంతే కాని దాని పూర్వ ధర్మములు గాని సత్వము గాని పోవు. ఈ విధంగా సూది కొంత అయస్కాంతత్వము పొందుతుంది.అనగా భగవంతుని సదా స్మరిస్తూ వుంటే భగవంతుడు మనస్సులో కొలువై తన యొక్క భగవద్గలక్షణాలను కొన్ని ప్రసాదిస్తాడన్న మాట.
ఇలా సూదంటురాయి సూదిని ఆకర్షించినట్లుగా, సూది కూడా సూదంటురాయికి ఆకర్షితమవుతుంది. భగవంతుడు సూదంటురాయి లాంటి వాడు.భక్తుడు సూది లాంటి వాడన్న మాట.
ఇవన్నీ ఆధ్యాత్మిక వాదులు వారి దృష్టితో భగవంతుడు, భక్తునికి అనుసంధానం చేస్తూ ఇవన్నీ చెప్పినప్పటికీ ఇందులో మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఒకటుంది.
అదేమిటంటే మనసున్న మనుషులుగా మంచిపనులనే సూదంటురాయికి ఆకర్షితులం కావాలి.మనమూ సూదంటురాయిలమై మరికొందరిని మంచివారుగా తయారు చేయాలి.
ఇదండీ "అయస్కాంత సూచీ న్యాయము"లోని నిగూఢమైన అర్థం.
ప్రభాత కిరణాల నమస్సులతో 🙏

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి