భోగి పిడకలతో గాలి శుద్ధి.


 భోగి మంటలో పేడపిడకలు వేయడం ద్వారా గాలిలో శుద్ధి ఏర్పడునని, అగ్నిదేవునికి ఆరాధించినట్లవుతుందని, వాయుదేవునికి గౌరవించడమేనని, రాజాం రచయితల వేదిక సభ్యులు, జాతీయ స్థాయి ఉత్తమ ఉపాధ్యాయ పురస్కార గ్రహీత కుదమ తిరుమలరావు అన్నారు. 
రాజాం భోగిమంట వద్ద
పేడపిడకల ప్రాధాన్యత గూర్చి ఆయన మాట్లాడుతూ 
సూర్యుడు మకరరాశిలోకి సంక్రమణం అనే ప్రవేశాన్ని  పురస్కరించుకుని మకర సంక్రాంతిగా పిలుచుకుంటున్నామని, సంక్రాంతికి ముందురోజు ఒక సాంప్రదాయకంగా ఈ భోగిమంటలు వేస్తున్నామని అన్నారు. దక్షిణాయనంలో మనం ఎదుర్కొనే కష్టాలను ఈ భోగిమంటకు ఆహుతినిచ్చీ, సౌఖ్యానికి పరమార్ధమైన భుగ్ ని ఆహ్వానించడంతో ఈ మంటకు భోగి మంట అని పిలుచుకుంటున్నామని తిరుమలరావు అన్నారు.  
పేడ కలిసిన మంట వలన గాలిలో ప్రాణవాయువు విడుదలౌతుందని, సూక్ష్మక్రిములు నశిస్తాయని, చలికాలపు శ్వాస సంబంధిత వ్యాథులను నిర్మూలించేలా ఈ భోగి మంట ఔషదంలా పనిచేస్తుందని అన్నారు. రావి, మామిడి, మేడి వంటి చెట్ల కలపను ఈ పేడపిడకలతో పాటు భోగి మంటలో వేయడం ద్వారా లభించే ఆ వెచ్చదనంవలన శరీరంలో డెబ్బది రెండు వేల నాడులు పరిశుభ్రత పొందునని, మానసిక వికాసానికి దోహదపడునని తిరుమలరావు అన్నారు.  శ్రీరంగనాథస్వామిలో గోదాదేవి లీనమై భోగాన్ని పొందే సందర్భానికి సూచికగా ఈ భోగి పండుగ జరుపుకుంటున్నామని అన్నారు. 
శ్రీకృష్ణుడు ఇంద్రునికి గుణపాఠం నేర్పే సందర్భంగా గోవర్ధన పర్వతాన్ని ఎత్తిన రోజు కూడా ఈ భోగి పండుగ రోజేనని ఆయన గుర్తుచేసారు. శాపవశంగా బసవన్నను భువికి పంపీ, రైతుల పాలిట దైవంగా కొలిచే నేపథ్యంలో ఆ ఆవుపేడ పిడకలు ప్రాథాన్యం సంతరించుకున్నాయని తిరుమలరావు అన్నారు. శ్రీవిష్ణువు పాతాళానికి తొక్కి బలిచక్రవర్తిని పాతాళరాజుగా మార్చిననూ, ప్రతి సంక్రాంతికీ ముందు రోజు భూమిపైకి వచ్చి ప్రజలను సమస్త జీవకోటినీ ఆశీర్వదించాలని కోరడంతో బలిచక్రవర్తిని స్వాగతిస్తూ ఈ భోగి మంట ఆచారం మనమంతా పాటిస్తున్నామని వివరించారు. తరతరాలుగా భోగిపిడకలను భోగి మంటల్లో వేయుటను ఒక పూజ్యభావంతో కొలుచుకుంటున్నామని అన్నారు.
కామెంట్‌లు