చిత్రాతి చిత్రమైనది జీవితం ఈ భూమి మీదకు వారిని ఎందుకు తీసుకువస్తుందో దానితో ఏమి చేయిస్తుందో ఎలా చేయిస్తుందో ప్రకృతి దాని ఇష్టం వచ్చినట్టు దాని పంతం ఏదో ఒకటి పెంచుకుంటూ పోతుంది ఏ కుటుంబంలోనైనా బిడ్డ సక్రమంగా పెరగాలి అంటే తల్లిదండ్రులు జీవితంలో సంప్రదాయబద్ధంగా ఉండాలి ఏ క్షణానికి ఏ పనులు చేయాలో వాటిని ఆ క్షణాన చేసినట్లయితే ఎలాంటి భౌతికమైన మానసికమైన బాధలు లేకుండా ఉంటాయని మన పెద్దలు చెబుతూ ఉంటారు పిల్లలు చెడిపోవడానికి కారణం తల్లిదండ్రులే అని చాలామంది చెబుతూ ఉంటారు కానీ తల్లిదండ్రులు చెప్పిన పనులను చేస్తున్నట్లు నటిస్తూ తమ తిరుగుబాటు స్నేహితులతో కలిసి ఉండడం వల్ల వారి బుద్ధులు వీరికి వచ్చి ఆ కుటుంబానికి సమాజానికి చెడ్డ పేరు తీసుకు వస్తూ ఉంటారు చాలామంది పిల్లలు.
అసలు జీవితం అంటేనే బుధ్బుద ప్రాయం నీటి ప్రవాహలో మనకు కనిపిస్తున్న బుడగ ఎలా ఉంటుందో అలాంటిదే మానవ జీవితం కూడా ఎంతో అందంగా చూడడానికి ముచ్చటగా పిల్లలు ఆడుకోవడానికి ఇష్టపడే ఆ బుడగలను చేతిలోనికి తీసుకొని ఆడుకోవడానికి ఉపక్రమించే సమయానికి ముందే అవి పేలిపోతాయి మానవ జీవితం కూడా అంతే తల్లి గర్భంలో నుంచి భూమ్మీదకు వచ్చిన ఏ బిడ్డ ఎన్ని సంవత్సరాలు బ్రతికి ఉంటాడో అన్నది ఎవరు చెప్పలేరు మనతో మాట్లాడుతూ ఉన్నవాడు గుండె ఆగిపోయిన సందర్భాలు అనేకం ఉన్నాయి రాత్రిపూట హాయిగా సరదాగా మాటలు చెప్పుకుంటూ ఉన్న కుటుంబ సభ్యులు పండుకొని ఉదయం లే వస్తాడో లేదో చెప్పడం కష్టం నిద్రలోనే తమ ఆయువు పూర్తి చేసుకున్న వ్యక్తులను అనేక మందిని మనం ఈ లోకంలో చూస్తూనే ఉన్నాం. సనాతన ఆచారాలను అనునిత్యం అనుసరిస్తూ ఉండే కుటుంబాల్లో జన్మించిన బిడ్డలు తమ తల్లిదండ్రులు చేస్తున్న పనులనే అనుసరిస్తూ వారు కూడా ఎంతో ఆరోగ్యంగా పద్ధతిగా జీవితాన్ని గడుపుతూ ఉంటారు ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి నిద్రించేంతవరకు ఏమేమి పనులు చేయాలో ముందుగానే నిర్ణయించుకొని వాటిని ఆ సమయానికి చేస్తూ ఇతర ఆలోచనలకు స్వస్తి చెప్పి తల్లిదండ్రుల చెప్పు చేతుల్లో నడుస్తున్న ప్రతి బిడ్డ తన కుటుంబానికి గ్రామానికి పేరు తీసుకు వచ్చే పరిస్థితిలో ఉంటాడు అలాకాకుండా తల్లిదండ్రులే అక్రమ పద్ధతిలో జీవితాన్ని కొనసాగించకపోయినట్లయితే ఆ పద్ధతిని బిడ్డలు కూడా అనుసరిస్తూ వారు కూడా అలాంటి అలవాట్లనే చేసుకోవడానికి అవకాశం ఉంటుంది కనుక బిడ్డల ప్రగతి అభ్యున్నతి తల్లిదండ్రుల చేతులలో ఉన్నవి అని మన పెద్దవారు చెబుతారు.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి