కదంబం;- డా. నీలం స్వాతి,చిన్న చెరుకూరు గ్రామం,నెల్లూరు.6302811961.

 హనుమంతుని మించిన బలాఢ్యుడు ఈ ప్రపంచంలో లేడు అని అందరికీ తెలిసిన విషయమే  వాలి తన సోదరుడు సుగ్రీవుని  బయటకు పంపించినప్పుడు ఆ వాలిని ఎందుకు చంపలేదు అని అనేకమందికి అనుమానాలు వస్తూ ఉంటాయి. కానీ దానికి సమాధానం పరాశరా సంహిత నుంచి సేకరించబడిన విషయము ఏంటంటే  ఆంజనేయుని తల్లి అంజనాదేవి  వాలిని చంపవద్దు అని ఆజ్ఞాపించింది  మాతృమూర్తి ఆజ్ఞను   జవదాటలేక  ఆ పని చేయలేదు  ఒక సందర్భంలో హనుమంతుడు  ఆసనంగా వేశాడు  హనుమంతుని మేనమామలు  వాలి సుగ్రీవుడు  వారి భార్యలు తార రుమ  చైత్రమాసంలో పుష్యమి నక్షత్రం గల రోజు హనుమాన్ కి పర్వదినం.
హనుమంతుడి సీతాదేవిని వెతకటానికి  దక్షిణ దిక్కుకు  వెళ్ళాడు  వైశాఖమాసంలో ఆశ్లేష నక్షత్రం హనుమాన్ పర్వదినం  హనుమంతుడు ఆదేశం ఇవ్వడం వలన స్వయంప్రభ గృహంలో ప్రవేశించారు  ప్రాయోపవేశ యత్నంలో ఉన్న  సంపాతి అనే పక్షి  రక్షించింది సముద్ర లంఘనం కోసం హనుమంతుడు మహేంద్ర పర్వతం ఎక్కాడు. సప్త చిరంజీవులలో హనుమంతుడు ఒకడు  కేసరి భార్య అయిన అంజన పుత్రుడే హనుమంతుడు  భర్త ఆజ్ఞ ప్రకారం వాయుదేవుని కొలిచిన అంజనాదేవికి వాయిదేవుడు ప్రత్యక్షమై తన గర్భంలో  శివుని శక్తిని ఆమెకు వరంగా ఇచ్చాడు  గర్భవతి కావడం  శ్రీరామచంద్రమూర్తికి  అంగరక్షకుడై  సీతారాములను కలిపిన  హనుమంతుడు జన్మించడం జరిగింది.
పుట్టుకతోనే హనుమంతుడు శ్రీరామ భక్తుడు  రావణుడు మొదలైన రాక్షసులను ఎదిరించి సీత ఉనికిని తెలుసుకొని లంకేశ్వరుని హతమార్చడంలో శ్రీరాముడికి ఎనలేని సేవ చేసిన మహా భక్తుడు  మహాభారత యుద్ధంలో అర్జునుని రథము పై వెలసి పాండవుల విజయానికి  కూడా దోహదకారి అయ్యాడు హనుమంతుడు. లంకలో హనుమంతుడు ప్రాకారంలో దూతగా ప్రవేశించాడు  శత్రువుల ప్రవేశంలో హనుమంతుడు పాటించిన శాస్త్ర నియమం  ఎడమ కాలు ముందు పెట్టి  తరువాత లోపలికి వెళ్లడం  మండోదరిని చూసి  సీతగా భ్రమించాడు  కోతి చేష్టలన్నీ  చేసిన తర్వాత  బుద్ధి పనిచేయడంతో ఆమె సీతాదేవి కాదు మహా పతివ్రత ఆమె ఇక్కడ ఉండే అవసరమే లేదు అని తిరిగి చూసి మండోదరిగా గుర్తించాడు.

కామెంట్‌లు