ఆకాశవాణి విజయవాడ కేంద్రం;- ఏ.బి ఆనంద్,ఆకాశవాణి,విజయవాడ కేంద్రం,9492811322

 బాలమురళి గారు ఇతర భాషల వారితో వారి భాషలో మాట్లాడడం జుగల బందీలో తన చాకచక్యం  చూపించడం తనకే  చెల్లు ప్యారిస్ లో జరిగిన సంగీత సభలో వారు రామాదాసు కీర్తన ఆలపిస్తున్నప్పుడు ప్యారిస్ లో వీరికి అతిధ్య మిచ్చిన యువతి తన పేరులో కీర్తన చేసి పాడుతున్నాడని ఎంతో ఆనందంతో ఆ సభలో నృత్యం చేసిన సంఘటనలు ఎన్నో జరిగాయి  విజయవాడలో రామా టాకీస్ దగ్గర కొత్తగా కట్టిన రైస్ మిల్లర్స్ మొదటి కార్యక్రమము బాలమురళి   గారిదే  ఆ కార్యక్రమంలో బంటు రీతి కొలువీయవయ్యా రామ అన్నకీర్తనను ప్రత్యేకంగా పాడుతూ నెరవు వేస్తున్న సమయంలో మధ్యలోనే ఆపి  విశ్వనాథ సత్యనారాయణ గారు అంత పారవశ్యంలో పాడితే నాలాంటి వాడి సున్నిత హృదయం ఎలా ఉంటుందిరా. విశ్వనాథ వారికి ఎవరినైనా ఏక వచ్చిన ప్రయోగం చేయడమే అలవాటు స్త్రీ పురుషభ్యంతరం లేదు నరాలు తెగిపోవా అన్న పొగడ్త భారతరత్న బిరుదుకు ఆపాదించారు ఆయన  అలాంటి ప్రతిపాదన ఆ మహా వ్యక్తి భౌతికంగా మనల్ని వీడినా ఆయన స్వరం మాత్రం ఆకాశవాణి ఉన్నంతవరకు చిరస్థాయిగా శాశ్వతంగా ఉంటుంది అలాంటి మహానుభావుడు నాకు పరిచయం కావడం చివరి వరకు నన్ను గురువుగారు అని పిలవడం నా సుకృతం  దానికి మూలకారకరాలు కుమారి బీ.వి  కనకదుర్గ  విజయవాడ పట్టణంలో ప్రముఖ రేడియో వ్యాపారవేత్త జంధ్యాల నారాయణమూర్తి గారు మరి సీరియల్ ప్రతి ఇంటికి చేర్చిన   ఘనుడు. ఆ ప్రయత్నంలో మర్ఫిని వాయిదాల పద్ధతిలో ప్రతి ఇంటికి చేర్చినవాడు నారాయణమూర్తి గారి అబ్బాయి  జంధ్యాల అతనినీ మేమంతా శాస్త్రి అని పిలుస్తాం ఎస్ ఆర్ ఆర్ కాలేజీలో నాకు రెండు సంవత్సరాల జూనియర్ సుత్తి వీరభద్ర రావుతో చదివాడు అప్పటినుంచి నాటకరచన పై అభిరుచి పెంచుకొని తానే వ్రాసి నాటకాలను తన బృందంతో ప్రదర్శించేవారు. నేను ఆకాశవాణి కేంద్రానికి వచ్చిన తర్వాత నండూరి సుబ్బారావు గారు పోలవరపు సూర్య ప్రకాష్ రావు గారు నాటక పోటీలకు న్యాయనిర్ణేతలుగా వెళ్లే వాళ్ళం  జంధ్యాల నాటకానికి బహుమతి రాకపోతే విజయవాడ వచ్చిన తర్వాత మమ్మల్ని కలిసి బహుమతి రాకపోవడానికి కారణాలు తెలుసుకొని వెళ్ళేవాడు మొదటి నుంచి సానుకూల దృక్పథంతో నడిచినవాడు.
కామెంట్‌లు