తారకాసురుడు మహాభయంకరుడై లోకాలని పీడిస్తూ ఉంటే దేవతలందరూ శివుని ప్రార్థించారు " ఆయన వీర్యంతో పుట్టే కొడుకు మాత్రమే వాడిని చంపగలడు అని తెలుసుకున్నారు.బ్రహ్మ సలహాతో అంతా సనత్కుమారుడిని ప్రార్థించి" నీవు శివాంశ తో పుట్టి తారకాసురుని చంపు" అని అడిగారు. ఆయన మహా తపస్వి.శివునితో" నీకు మాత్రమే కొడుకు గా పుడ్తా" అన్నాడు.అప్పటికే శివపార్వతుల పెళ్లి జరిగింది.ఆఆది దంపతుల తేజస్సుని ఎవరూ భరించలేరు.ఋషులంతా దేవతల్ని ప్రార్థించారు ఎలా శివకుమారుడు పుడతాడు? సనత్కుమారుడు
పార్వతీ గర్భంలో ఉండటానికి ఒప్పుకోలేదు. శివపార్వతులు తపస్సు లో మునిగారు. అంతా శివుని ప్రార్థించారు." నా వీర్యం తేజస్సుని భూమి పైకి వదులుతాను" అని అలా చేశాడు.భూమి ఆవేడిని శక్తిని తట్టుకోలేక బ్రహ్మ తో మొర పెట్టుకుంది.ఆయన దాన్ని అగ్నిలో వేయమన్నాడు. అలా అగ్ని లో శివతేజస్సు ఉండిపోయింది.ఇక తారకాసురుని ఆగడాలు మితిమీరుతున్నాయి.2మళ్లీ దేవతలు ప్రార్థన చేయడంతో బ్రహ్మ అన్నాడు " పార్వతీ దేవి చెల్లి గంగ హిమవంతుని రెండో కూతురు.ఆమెలో నీశివతేజస్సుని వదులు" అని చెప్పటంతో అగ్ని అలాగే చేయడం గంగ ఆవేడిని భరించలేక " బాబోయ్! నానీరు కలుషితం అవుతూ సకల జలచరాలు చనిపోతున్నాయి" అని కైలాసం దగ్గర ఉన్న రెల్లు పొదల్లో పారేసింది.పెద్దకాంతి పుంజం వెలువడింది.బంగారం వెండి రాగి రంగులో మెరుస్తూ కనపడ్డాయి.అలా లోహాలు వచ్చాయి.ఇంతలో ఆరు ముఖాలతో శిశువు కనపడి తే ఆరుగురు కృత్తికలు కన్యకా స్వరూపులు ఆ ఆరు ముఖాలున్న శిశువుకు పాలిచ్చారు. అందుకే కార్తికేయుడు అని పిలుస్తారు.ఒకే ఒక్క రోజు ఉన్న శిశువు శ్రావణ తటాకం నుంచి దివ్యశక్తితో జగదాంబ ఇచ్చిన శూలంతో తారకాసురుని సంహరించి సుబ్రహ్మణ్యస్వామి దేవసేనా పతిగా అవతరించాడు.
ఆయన ముద్దుగా చిన్నపిల్లాడి రూపంలో అందరికీ దర్శనమిస్తాడు.ఆయనలో అగ్ని జలం వాయువు ఆకాశం పృథ్వీ తత్వాలు ఉన్నాయి.
ఆయనే కుమారిలభట్టుగా వేదప్రచారం గావించారు.భక్తజ్ఞాన సంబంధం గా మళ్ళీ పుట్టాడు.శివాలయంలో జ్యోతి స్వరూపుడు గా శివలింగం లో ఐక్యమైనాడు.ఇదీ తారకాసురుని సంహారంకథలో సుబ్రహ్మణ్య స్వామి ఉత్పత్తిని గూర్చి
వివిధ గ్రంథాల్లో ఉన్న కథలు.

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి