శ్రీ విష్ణు సహస్రనామాలు (బాల పంచపది )ఎం. వి. ఉమాదేవి
561)వనమాలీ -

వనమాలను ధరించినవాడు 
వైజయంతిని దాల్చియున్నవాడు 
మహావిష్ణువై వెలసినవాడు 
ఆకులుపూల తోమాలదాల్చువాడు 
శ్రీవిష్ణు సహస్రనామాలు ఉమా!
562)హలాయుధః -

నాగలి ఆయుధముగానున్నవాడు 
బలరామావతారమయినవాడు 
సంవర్తకము కలిగియున్నవాడు 
విశ్వము మడకదున్నునట్టివాడు 
 శ్రీ విష్ణు సహస్రనామాలు ఉమా!
563)ఆదిత్యః -

అదితియొక్క కుమారుడైనవాడు 
వామనావతారమునెత్తినవాడు 
భూమ్యాకాశముల కొలిచినవాడు 
బలిని పాతాళముకంపినవాడు 
శ్రీ విష్ణు సహస్రనామాలు ఉమా!
564)జ్యోతిరాదిత్యః -

సూర్యునియందున్నట్టివాడు 
తేజోరూపమున భాసిల్లువాడు 
నక్షత్రముగా ప్రకాశించువాడు 
అగ్నిరూపంలో యుండువాడు 
శ్రీ విష్ణు సహస్రనామాలు ఉమా!
565)సహిష్ణుః -

ద్వంద్వములను సహించువాడు 
అన్నిటిని ఓర్చుకోగలవాడు 
సహనాన్ని కలిగియున్నవాడు 
ఓర్పుతోనుండగలవాడు 
శ్రీవిష్ణు సహస్రనామాలు ఉమా!

(సశేషం )

కామెంట్‌లు