621)విధేయాత్మా -
భక్తులకు విధేయుడైనవాడు
అందుబాటులో నున్నట్టివాడు
ఆశ్రితులను ఆదరించువాడు
అవసరములు దీర్చగలిగినవాడు
శ్రీవిష్ణు సహస్రనామాలు ఉమా!
622)సత్కీర్తిః -
సత్యమైన యశస్సుగలవాడు
కీర్తివంతుడై యున్నవాడు
అంతటనూ పేరున్నట్టివాడు
పలునామాలతో భాసిల్లువాడు
శ్రీ విష్ణు సహస్రనామాలు ఉమా!
623)ఛిన్న సంశయః -
సంశయములు లేనట్టివాడు
సందేహములు తొలగించువాడు
భక్తులకు సులువైనవాడు
సరళముగా పొందగలవాడు
శ్రీ విష్ణు సహస్రనామాలు ఉమా!
624)ఉదీర్ణః -
సర్వజీవులకన్ననూ ఉత్తముడు
ఉదార స్వభావముగలవాడు
గొప్పదగు మనస్సున్నట్టివాడు
బేధభావముతెలియనివాడు
శ్రీ విష్ణు సహస్రనామాలు ఉమా!
625)సర్వ తక్షస్సుః -
అంతటా నేత్రములున్నట్టివాడు
దీర్ఘమైన చూపులు గలవాడు
ఘనమైన నేత్రములున్నవాడు
సర్వ తక్షస్సుడైనట్టివాడు
శ్రీవిష్ణు సహస్రనామాలు ఉమా!
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి