అమ్మ నీ గర్భాలయం
మాకదే దేవాలయం2
అమ్మ నీ చేతి చలువ
మాకదే అమృతహస్తం2
అమ్మ
అమ్మ నీ అడుగుజాడలు
మాకు చూపె ముందడుగులు2
అమ్మ నీ త్యాగగుణము
మాకు అబ్బే దానగుణము2
అమ్మ
అమ్మ నీ సహన శీలం
మాలో పెంచెను యోచనం2
అమ్మ నీ కంచు కంఠం
మాలో పెంచెను సింహబలం2
అమ్మ
అమ్మ నీ సాహసం
మాలో నింపెను ధైర్యం గుణం2
అమ్మకే మా హృదయపీఠం
అది మా అమ్మ కొలువున్న దేవాలయం2
అమ్మ
అమ్మ గర్భాలయం మాకదేదేవాలయం (బాల గేయం);- - అంకాల సోమయ్య దేవరుప్పుల-జనగామ-9640748497
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి