ఏదారి లేకుండా
ఎటువైపో
నా పయనం
ఇంటిదాన్ని
కన్నపిల్లలను
పస్తులుంచకుండా
ఉండాలనే
ఏకైక లక్ష్యంతో
పని వెతుక్కుంటూ
ఈ గమ్యం లేని
పయనం మొదలుపెట్టిన
ఇళ్లల్లో ఏపనైనాసరే
నేనుచేస్త
అది తట్ట పనా
మట్టి పనా
ఏదైతేనేం
ఇంటికి యిన్ని
బియ్యం నూకలు
తీసుకొని పోవాలే
నేను మంచినీళ్లు
తాగైనబతుకుత
లోకం తెలియని
నా బిడ్డలకు
కడుపుకు
గంజి నీళ్లు పోయకపోతే
నా శారీరక వాంఛ
తీర్చుకోవడానికి
పెళ్లి చేసుకున్నోడు
కష్టం చేతగానోడనే
అపవాదు మోయవలసి
ఉంటుంది
పని దొరికక పోయేసరికి
ముప్పురి గొన్న ఆలోచనలు
ఆదైవం కరుణించి
ఈ రోజు పని దొరికింది
ప్రశ్నల పరంపరకు
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి