కొడుకా ---రేపు నువ్వూ-- ముసలివాడవవుతావు;- - అంకాల సోమయ్య దేవరుప్పుల-జనగామ-9640748497
కొడుక నీకు రేపు రాక తప్పదురా
ముసలితనం
మమ్ముఈసడించకురా
నిన్ను కన్న తల్లి దండ్రులమేగదరమేము
నీ పిల్లలోలే మమ్ముజూడరా

నిన్ను కన్నప్పుడు నాకడుపుకెన్నికుట్లుబడ్డయో
నువ్వు ఏడిస్తే నాప్రాణమెంత
తల్లడిల్లెదో
ఎన్ని నిద్ర లేని రాత్రులు గడిపితినోకొడుకా 
నీ ఒంట్లో బాగలేకుంటే
ఎన్ని నోములు నోచికంటిరా
కొడుకా నావరాల మూటవేనువ్వని

ఏమి సంపాదించావనికొడుకా
మమ్ములను బాధించబోకురా
మమ్మల్ని వృద్దాశ్రమానికి పంపకు కొడుకా
ఇంట్లో ఏదో ఓ మూల తలదాచుకుంటాము
మేము నీకుభారంకాముకొడుకా
నీ పిల్లలనాడిస్తంకొడుకా
నీ ఇంట్లో పనిజేస్తంకొడుకా
మామీదకాసింత దయజూపుకొడుకా
మేము మీ కన్నతల్లి దండ్రులమే
బిడ్డా

(  అంతర్జాతీయ వృద్ధుల దినోత్సవం సందర్భంగా వ్రాయడం జరిగింది కవిత)


కామెంట్‌లు