నిప్పు కణికలు;- -గద్వాల సోమన్న,9966414580
విడిచిపెట్టు గుండెలోని
నిరాశా నిట్టూర్పులు
మహాత్ముల  మాటలలోని
మంచి మనకు  ఓదార్పులు

చిచ్చుపెట్టే మాటలే!
జీవితాల్లో వడగాల్పులు
చెప్పుడు మాటలే! కదా
చేయు బ్రతుకులు శిథిలాలు

నిగ్రహాన్ని కోల్పోతే
చుట్టుముట్టు అపజయాలు
బద్దకం అవరిస్తే
ప్రగతికి అవరోధాలు

సూటిపోటి మాటలే
గుండెల్లో గునపాలు
వెటకారం హెచ్చితే!
చేయును అభాసుపాలు


కామెంట్‌లు