అమ్మే మన తొలిగురువు
అమ్మఒడే మన తొలిబడి
అమ్మపలుకు అమృతపుచినుకు
అమ్మచూపే మార్గదర్శనం
సకలలోకాలలో ఉత్తమం
అమ్మమాట బ్రతుకుబాట
బ్రతుకుకోసం ఆరాటాలు,పోరాటాలు
బ్రతుకువిలువల విన్యాసాలు
అమ్మచెప్పకనే చెప్పే జీవితపాఠాలు
తన సంతానానికి ముద్దుముద్దుగా
చక్కని కథలు,పాటలు వినిపించి
వారిని వీరులుగా,ధీరులుగా,శూరులుగా,
భక్తులుగా,సత్యాహింసల వ్రతావలంబులుగా
తయారుచేసే అమోఘ విజ్ఞానఖని
ఒక మామూలు మనిషిని కూడా
ఒక గాంధీగా,ఒక వివేకానందునిగా,
ఒక శివాజీగా,ఒక అబ్దుల్ కలాముగా
తన మాటలతో మార్చగలదు
అమ్మఒడికి మించిన స్వర్గమేమున్నది?
అమ్మఒడికి మించిన బడియేమున్నది?!!
**************************************
తొలిగురువు;- - డా.గౌరవరాజు సతీష్ కుమార్
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి