'హరీ!'శతకపద్యములు.;-టి. వి. యెల్. గాయత్రి.- పూణే. మహారాష్ట్ర
 107
ఉత్పలమాల.
పాలన జేయువాడవని పట్టితి నీపదయుగ్మమున్ సదా
మేలును గూర్చువాడవట!మిక్కుటమౌ లలిఁ జూపరాద!నేఁ
గూళల సంగతిన్ విడిచి క్రోలగ నీకరుణామృతంబు వే
వాలితి నీదు సన్నిధిని బాలను!నా దెసఁ గాంచుమా!హరీ!//
107.
చంపకమాల.
విలువగు గ్రంథముల్  చదువ విద్యనొకింతయు నేర్వనైతి నా 
తలపున వచ్చు నీ చరిత తన్మయమొందుచు తల్చుకొంచు నే 
సులువగు భాషలోన మదిఁ సొక్కుచు పద్యము లెల్ల వ్రాయ నీ 
వలుసుగ జూడకో వరద!పద్య రసంబును గ్రోలుమా హరీ!//
108.
చంపకమాల.
కతలుగ నీదు లీలలను గమ్మగ పాడుచు ప్రొద్దుప్రొద్దు స 
ద్గతులను బొందిరా మునులు కర్మల శేషము తొల్గునంచు నీ 
శతకము వ్రాయబూనితిని సద్గురు శ్రద్ధగ విద్య నేర్పగన్ 
సతతము నీకు దాసినగు జ్ఞానము నీయుమ!మేలుగన్ హరీ!//

కామెంట్‌లు