మొదట ప్రయాణ సాధనంగా సైకిల్ తో ప్రారంభమైంది మా ఆత్మీయ గురు తిరుమల గారు ఎప్పుడూ చెప్తూ ఉంటాడు కుటుంబంతో సహా కొంచెం దూరం వెళ్లవలసిన పరిస్థితి ఏర్పడినప్పుడు కారులో వెళ్ళండి రెండు కిలోమీటర్లు ఆ పైగా ప్రాంతాల్లో ఉన్న దూరానికి వెళ్ళవలసి వస్తే స్కూటర్ వాడండి ఒక కిలో లేదా కిలోన్నర దూరం ఉంటే సైకిల్ వాడండి ఒకటి రెండు పర్లాంగుల్లో మీకు పని ఉన్నప్పుడు నడిచి వెళ్ళండి దానివల్ల ఆరోగ్యం బాగు పడుతుంది అని సలహా ఇస్తూ ఉంటాడు. మధ్యతరగతి కుటుంబాలకు ఈ సైకిల్ ఒక వరం సైకిల్ తొక్కడం వల్ల తన శరీరం తన అదుపులో ఉంటుంది నీవు ఎంత వేగంగా నడపదలుచుకుంటే అంత వేగంగా వెళుతుంది నిదానంగా ప్రక్క వాటితో మాట్లాడుకుంటూ వెళ్లాలనుకుంటే నిదానంగానే వెళ్ళవచ్చు పగలైనా రాత్రి అయినా సైకిల్ పై వెళ్లడం వల్ల ప్రమాదాలను నివారించవచ్చు ఏ విధమైన అడ్డంకులు లేకుండా వెళుతూ ఉంటే శరీరానికి చమట పట్టి ఆరోగ్యాన్ని సక్రమంగా ఉండేలా చూస్తోంది సమాజంలో కూడా ఎవరికి ఇది అడ్డురాదు శబ్ద కాలుష్యం కూడా ఉండదు ఊబకాయం లేకుండా ఉంటుంది ఊపిరితిత్తులు సక్రమంగా పనిచేస్తాయి జబ్బులన్నీ పోతాయి శరీర ఆకృతి సక్రమంగా ఉంటుంది ఆర్థికంగా కూడా సామాన్యులకు అందుబాటులో ఉండి దానిని నడపడానికి కూడా చాలా తేలికగా ఉంటుంది.ఇది చక్కటి ఆరోగ్య మార్గం ఊబకాయం ఉన్న వారి శరీరాన్ని తగ్గిస్తుంది గుండె జబ్బులు రావు కండలు దిట్టమవుతాయి కొవ్వు కరిగిపోతుంది ఆకలి పెరిగి పుష్టికరమైన ఆరోగ్యాన్ని తీసుకోవడానికి వీలవుతుంది రక్తపోటు తగ్గి శక్తిని సమకూరుస్తుంది సిగ్గు పడవలసిన అవసరం లేదు ఆర్థికంగా డబ్బులు ఏమి ఖర్చు కావు ఎముకలు గట్టి పడతాయి సమతుల్యతను పాటిస్థాయి కాళ్ల కoడరాలు గట్టిపడతాయి ఆ సైకిల్ తొక్కినప్పుడు పిల్లల ఆనందాన్ని మనం చూసినట్లయితే ఎంత తృప్తిగా ఉంటుందో చెప్పలేము అది మనకు దొరుకుతుంది సేవ చేస్తోంది సైకిల్ తొక్కడానికి సాకులు ఏవి ఉండవు సమర శంఖాన్ని ఊది సైకిల్ పైన ప్రయాణాన్ని కొనసాగించి మీ ఆరోగ్యాన్ని బాగు చేసుకుని ఆర్థిక పరిస్థితిని మెరుగుపరుచుకో అని మేధావి వర్గం చెపుతుంది
వైవిధ్యం;- సాయి వేమన్ దొంతి రెడ్డి,కుంచన పల్లి,9182244143.
• T. VEDANTA SURY

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి