వైవిధ్యం;- సాయి వేమన్ దొంతి రెడ్డి,కుంచనపల్లి.9182244143
 నేల మీద కూర్చుని దీర్ఘంగా శ్వాస తీసుకోవాలి తర్వాత నెమ్మదిగా నోటితో ఆ గాలిని వదిలివేయాలి  లేకపోయినట్లయితే ముక్కు ఒక రంధ్రం తో దీర్ఘ శాస తీసుకుని మరొక దాని నుంచి వదలాలి వీటిలో నచ్చిన దాన్ని రోజుకు కనీసం రెండు నిమిషాలైనా ప్రయత్నించాలి  శ్వాస తీసుకుని వదిలేటప్పుడు వెంటనే వదలకూడదు  శ్వాస తీసుకోవడానికి ఎంత సమయం పట్టిందో అంత సమయాన్ని  శరీరంలో ఉంచి ఆ తర్వాత నిదానంగా వదలాలి  లేకపోయినట్లయితే ముక్కు ఒక రంధ్రం దీర్ఘశాస తీసుకుని మరో దాని నుంచి వదలాలి  ఇది కూడా అలాగనే  వీటిలో మనకు నచ్చిన దాన్ని కనీసం రెండు నిమిషాలు అయినా చేయాలి  రోజు ఇంటి పని అని ఆఫీసు పని అని పడుతూ లేస్తూ ఉంటాం. ఈ క్రమంలో ఒత్తిడి బారిన పడతాo  దాని నుంచి బయటపడడానికి ఉత్తమ పరిష్కారం  ఇవి నాడీ వ్యవస్థను ప్రశాంతంగా ఉంచి ఒత్తిడి ఆందోళనలను తగ్గిస్తాయి.ప్రతిరోజు ఈ విధంగా సాధన చేసుకున్నట్లయితే  ఊపిరితిత్తుల పనితీరు మెరుగుపడుతుంది  దానితోపాటు ఆస్తమా మొదలైన దీర్ఘకాలిక వ్యాధులకు ఇది ప్రయోజనకరం  లోతుగా ఊపిరి పీల్చుకుని వదలడం వల్ల శరీరానికి రక్తప్రసరణ బాగా జరుగుతుంది  దాంతో అవయవాల పనితీరు మెరుగుపడుతుంది రక్తపు పోటును తగ్గించడానికి ఇది ఉత్తమ సాధనం గుండె కూడా చాలా ఆరోగ్యంగా ఉంటుంది  మన పెద్దలు కాల కృత్యములు తీర్చు కోవడానికి ఇంటి దగ్గర నుంచి నీరు తీసుకుని దాదాపు మైలు దూరం వెళ్లి అక్కడ విసర్జన చేసి  గాయత్రి మంత్రంతో కూడిన  24 ఆసనాలను వేసి బాగా చెమట పట్టిన తర్వాత స్నానం చేసి  తిరిగి నడిచి రావడంతో ఆరోజు మొత్తం వారి మనసు ఎంతో ప్రశాంతంగా హాయిగా  అన్ని పనులు సుఖంగా చేసుకోవడానికి వీలుగా ఉంటుంది  ఆ విషయాన్ని మనం మర్చిపోకూడదు.
సమాజంలో  స్థితి పరులు తక్కువగాను సామాన్య పౌరులు ఎక్కువగానూ ఉన్నారు అన్న విషయం స్పష్టం  మనం స్నేహం చేయాలన్న  మన కష్టసుఖాలు చెప్పుకోవాలన్న ప్రతి ఒక్కరికి స్నేహితులు ఉండాలి  బంధువులు ఎలాగో ఉంటారు  పిలిచినప్పుడు వీడు నన్ను పిలవడానికి స్థాయి కలిగిన వాడేనా అని ఆలోచించేవాడిని ఏ పరిస్థితిలోనూ ఇంటికి పిలవద్దు  స్నేహితుల ఇంటికి వెళ్లి కాసేపు గడిపిపోతామని అనుకుంటే  నీకు గౌరవ మర్యాదలు ఇచ్చే ఇంటికి వెళ్ళు  ఇవ్వని వారి ఇంటి జోలికి వెళ్ళవద్దు  ఏదైనా చెప్పదలుచుకున్నది వ్యక్తిత్వం ఉన్నవారితో చెప్పు  అది లేని వారితో చెబితే నీవు  చులకన అయిపోవడానికి అవకాశం ఉంది  నోరు అదుపు లేని వారికి ఏ ఒక్క మాట చెప్పకు చెబితే అది  తమకు అందరికీ చెప్పినట్లే  అహంకారం చూపే వ్యక్తుల దరికి వెళ్లకుండా జాగ్రత్త పడమని పెద్దలు చెప్తారు.



కామెంట్‌లు