ఆ తల్లిని వారు పంచుకున్నారు;- అంకాల సోమయ్యదేవరుప్పులజనగామ9640 748497
ఆ తల్లిని వారు వంతులుగా 
 పంచుకున్నాం
కొడుకులు పసిపిల్లలుగా ఉన్నప్పుడే ఆమె పెనిమిటి కాలంచేస్తే పుట్టెడు దుఃఖంతో
కన్నమ్మకష్టాలు పడ్డ ఆతల్లి 
నడుముకు జోలె కొట్టుకొని కష్టపడి 
ముగ్గురు కొడుకులను 
 పెంచి పెద్ద చేసి విద్యాబుద్ధులు నేర్పించి ,ఉన్నతోద్యోగాలు సంపాదించుకొనేలా చేసిన కర్మానికి
ఆతల్లి కన్నముగ్గురు కొడుకులు
ఈ అవసాన దశలో, లేవలేని స్థితిలో 
తలా ఒక్క నెల చొప్పున సాకేలా ఒప్పందం కుదుర్చుకున్నారు 
రెక్కలున్నంతకాలం రికాం లేకుండా
 చాకిరీ చేయించుకొని
ముసల్ది లేవలేకుండయ్యేసరికి
నల్లపూసల్లతెల్లరాయిలేకుండా
ఆ తల్లిని నిలువుదోపిడీ చేసి నగనట్ర పొలంచెలుక అన్నీ 
తెగనమ్ముకొని
లోకాపకీర్తికని, లోకం తిట్టిపోస్తున్నదనే  భావనతో  తల్లిని ఎగట్రాలగేజీ అనుకున్న
 నిర్దయులైన ఆ కొడుకులు
 అయిష్టంగానే ఆతల్లి కి కాసిన్నీ గంజినీళ్ళుపోస్తున్నరు
ఆతల్లి ఇప్పుడు వయోభారంతో యాదిమరిచి బుక్కెడు బువ్వ కోసం తండ్లాడుతోంది
 తల్లి నోరెత్తలేదు అంతా యాదిమరచి
పసిపిల్లవానివలె అమాయకంగా
నవ్వుతుంది‌.
ఇన్ని ఇబ్బందులు పెట్టిన కొడుకులు రేపు ముసలివారు కారా?!
నిత్యం యవ్వనంగానే ఉంటారా?!
 అన్న భావన చూసే దయమయులకు కల్గినా నోరెత్తలేకున్నారు.


కామెంట్‌లు