కించిత్ కర్తవ్యం!;- -గద్వాల సోమన్న,9966414580
చిన్న చిన్న సమస్యలకు
తల బాదుకుని ఏడ్వకు
కలలన్నీ  చెదిరాయని
విలవిలలాడకు నేస్తం!

మరణమే శరణ్యమని
మనస్తాపం చెందకు
మట్టి మనిషినని నీలో
నీవు కుమిలి కుమిలి పోకు

చిటారు కొమ్మన పక్షి
కున్న ప్రశాంతను చూడు
రాలిపోతానని తెలిసిన
ఆకుకున్న ధైర్యం చూడు

అమావాస్య వెనువెంటనే
పున్నమి ఏతెంచినట్లు
కష్టాల వెనుక సుఖాలు
జీవితాల్లో మిరుమిట్లు

ఆకాశమే హద్దుగా
భూలోకమే సాక్షిగా
ఆత్మస్థైర్యంతో  ఇక
చెలరేగుము యోధునిగా


కామెంట్‌లు