సాంద్రనీహార తటిల్లతా సుమనోహరం
కేలనందిన పూలకొమ్మ సోయగం
తిలకించిన పుష్పరాగ పరాగ చాంచల్యం
కళ్ళ నీలాల ఆనింగి కాంతి మెరుపు తోడైన
మానవకన్యవా? లేక
యక్ష గంధర్వ కింపురుష దేవతా లలామవా?
నవమినాటి వెన్నెల రేయిన
వధూటిగా వన్నెలు చిన్నెలు వొలుక
మానినీ నీవు మౌనము వీడి పలుకు
నగ్నపాదాల కదలికల రహస్యం
వదలని సిగ్గునిగ్గుల బుగ్గల తపన
తళతళమెరిసే నీ లేత అధరకాంతులతో
రసడోలలూపి అనురాగబంధాన
నన్ను ముడివేయవా సఖీ!!
**************************************
కేలనందిన పూలకొమ్మ సోయగం
తిలకించిన పుష్పరాగ పరాగ చాంచల్యం
కళ్ళ నీలాల ఆనింగి కాంతి మెరుపు తోడైన
మానవకన్యవా? లేక
యక్ష గంధర్వ కింపురుష దేవతా లలామవా?
నవమినాటి వెన్నెల రేయిన
వధూటిగా వన్నెలు చిన్నెలు వొలుక
మానినీ నీవు మౌనము వీడి పలుకు
నగ్నపాదాల కదలికల రహస్యం
వదలని సిగ్గునిగ్గుల బుగ్గల తపన
తళతళమెరిసే నీ లేత అధరకాంతులతో
రసడోలలూపి అనురాగబంధాన
నన్ను ముడివేయవా సఖీ!!
**************************************
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి